లక్ష్మికి కానుక…. మరి సిద్దమ్మకి

సైరా నరసింహారెడ్డికి ప్రియురాలు లక్ష్మి పాత్రలో తమన్నా, భార్య సిద్ధమా పాత్రలో నయనతార నటించారు. మెయిన్ హీరోయిన్ నయనతార కన్నా ఎక్కువగా తమన్నానే హైలెట్ అవడం, సైరా [more]

Update: 2019-10-05 08:00 GMT

సైరా నరసింహారెడ్డికి ప్రియురాలు లక్ష్మి పాత్రలో తమన్నా, భార్య సిద్ధమా పాత్రలో నయనతార నటించారు. మెయిన్ హీరోయిన్ నయనతార కన్నా ఎక్కువగా తమన్నానే హైలెట్ అవడం, సైరా సినిమా ప్రమోషన్స్ లో నయన్ రాకుండా తమన్నానే హైలెట్ అవడం, సైరా సినిమా విడుదలయ్యాక నయన్ కన్నా ఎక్కువగా తమన్నాకి పేరు రావడంతో ఒక్క సారిగా తమన్నా పాపులర్ అయ్యింది. నిన్నమొన్నటివరకు ఔట్ డేటెడ్ హీరోయిన్ అనుకుంటే ఇప్పుడు సైరా సినిమాతో పేరుకు పేరు, అవకాశాలకు అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. నరసింహారెడ్డిని ఆరాధించే లక్ష్మి పాత్రలో తమన్నా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.

తమన్నాకి పెరిగిన వెయిట్….

ఇక నయన్ ఫస్ట్ హీరోయిన్ అనే సంగతి కూడా అందరూ మర్చిపోయేలా చేసింది తమన్నా. అయితే తమన్నా ప్రమోషన్స్ కి రావడం, సైరా ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో బాగా కష్టపడిన తమన్నాకి సైరా నిర్మాత రామ్ చరణ్ మంచి గిఫ్ట్ ఇచ్చాడట. ఆ విషయాన్నీ చరణ్ వైఫ్ ఉపాసన ట్వీట్ చేసింది. మిస్టర్ నిర్మాత (చరణ్) తమన్నాకి మంచి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పిన ఉపాసన తమన్నాని మిస్ అవుతున్నట్టుగా ట్వీట్ చేసింది. దానికి రిప్లై గా తమన్నా తన చేతి వేలుకి పెట్టుకున్న క్రిస్టల్ రింగ్ ని చూపిస్తూ నేను మిమ్మల్ని కలవడానికి తెగ వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పింది. మరి నయన్ ని లైట్ తీసుకుని తమన్నాకి ఇలా గిఫ్ట్ ఇవ్వడం చూస్తే నయన్ కి కాలుతుందేమో.

 

Tags:    

Similar News