వన్ అండ్ ఓన్లీ మహేష్

Update: 2018-04-09 01:39 GMT

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు ? దీనికి ఎవరి అభిమానులు తమ హీరోనే అనేస్తారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి దుకాక టాలీవుడ్ బాద్ షా ఫలానా హీరో అని చెప్పలేని పరిస్థితి ఎదురైంది. ఎన్టీఆర్ యుగం లో ఆయనే నెంబర్ వన్. ఆ తరువాత కృష్ణ, శోభన్ బాబు నువ్వా నేనా అనే రీతిలో సాగిపోయారు. చిరంజీవి ఆ తరువాత జనరేషన్ లో టాప్ లో కొనసాగారు. ఆయన తరువాత పవన్ కళ్యాణ్ కి ఓపెనింగ్స్ ఆ రేంజ్ లో ఉండటం బిజినెస్ పరంగా దూసుకుపోయినా ఆయన ఎక్కువ సినిమాల్లో నటించకపోవడంతో కేవలం పవర్ స్టార్ గా ఉండిపోయారు. ఇక రవితేజ, ప్రభాస్, మహేష్ బాబు నాగ చైతన్య ఇంకా యాంగ్ హీరోస్ ఎవరున్నా ఇప్పుడు నెంబర్ వన్ ప్రజల్లో ఎవరో ఈజీగా చెప్పేయొచ్చు.

సాంకేతిక పరిజ్ఞానంతో....

ఇప్పుడు ఎవరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత వుంది అన్నది ఇట్టే తేలిపోతుంది. ఫెస్ బుక్, ట్విటర్, వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జనబలాన్ని లెక్కేస్తున్నారు. ఈ ప్రకారం రేటింగ్ తీస్తే హీరో మహేష్ బాబు టాప్ లో దూసుకుపోతున్నారు. ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ 60 లక్షలకు చేరుకున్నారు. ఆ రేంజ్ లో దారిదాపుల్లోకి ఏ హీరో రాకపోవడం విశేషం. పైగా మహేష్ అంత కలివిడిగా వుండే రకం కూడా కాదు. తన పని ఏమిటో చేసుకుపోతూ ఉంటారు. ఇక ఆ తరువాత స్థానం మరీ చిత్రం హీరో విలన్ పాత్ర ఏదైనా సూపర్ గా నటించే రాణా 50 లక్షలమంది ఫాలోవర్స్ తో ఉండగా పవన్ కళ్యాణ్, నాగార్జున 40 లక్షలతో మూడు నాలుగు స్థానాల్లో పోటీ పడుతున్నారు. సినిమాల్లో ఒక రేంజ్ లో కుదిపేసే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ 20 లక్షలమంది ఫాలోవర్స్ మాత్రమే కలిగివుండటం గమనార్హం. దీన్ని బట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు కి అన్ని వర్గాల వారు కనెక్ట్ అయినట్లే గా. ట్విట్టర్ ప్రకారం చూస్తే మరి ఆయనే నంబర్ వన్ హీరో.

Similar News