మహేష్ భలే ప్లాన్ వేశాడుగా....!!

Update: 2018-10-28 08:45 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ వీరి మధ్యే ఉంది. మహేష్..రామ్ చరణ్..ఎన్టీఆర్..ప్రభాస్. మొన్నటివరకు పవన్ కళ్యాణ్ ఉండేవాడు కానీ తను ఇప్పుడు పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉండటంతో మిగితావాళ్లకి అడ్వాంటేజ్‌ అయింది. మొన్నటివరకు మహేష్ కు పవన్ పోటీ ఉండేవాడు. ఇప్పుడు తను లేకపోవడంతో కొత్త ప్లాన్ వేసి నెంబర్ స్థానాన్ని దక్కించుకుంద్దాం అని పావులు కదుపుతున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

మహేష్ కు అడ్వాంటేజీ ఇదే.....

ఎన్టీఆర్..రామ్ చరణ్ రెండేళ్ల వరకు రాజమౌళి సినిమాలో ఉండిపోతారు కాబట్టి మహేష్ ఇది పెద్ద అడ్వాంటేజ్‌ కానుంది. దాంతో ఆయన వచ్చే రెండేళ్లలో మహర్షితో పాటు మరో మూడు సినిమాలు పూర్తి చేయాలనీ నిర్ణయించుకున్నాడట. ఈనేపధ్యంలో మహేష్‌ స్టోరీ సెలక్షన్‌ టీమ్‌ని సిద్ధం చేసుకున్నాడట.

తనకు అనుకూలంగా.....

వారు పొటెన్షియల్‌ వుందనిపించిన కథల్ని సెలక్ట్‌ చేసి పక్కన పెడుతున్నారని, గ్యాప్‌ లేకుండా వరుసగా సినిమాలు చేసేలా ప్రణాళిక సిద్ధమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే చరణ్‌, ఎన్టీఆర్‌లకి గ్యాప్‌ వచ్చే ఈ టైమ్‌ని తనకి పూర్తి అనుకూలంగా మార్చుకోనున్నాడు మహేష్. ఒకరకంగా ఇది మహేష్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త. సాధారణంగా మహేష్ ఏడాదికి ఒక్క సినిమా తీయడమే కష్టం. అటువంటిది రెండేళ్లలో మూడు సినిమాలు అంటే మాములు విషయం కాదు.

Similar News