మహేష్ కన్నా చాలా ఎక్కువే..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. అయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా.. మహేష్ నెక్ట్స్ చిత్రానికి భారీ క్రేజ్ ఉంటుంది. కారణం [more]

Update: 2019-03-25 08:20 GMT

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. అయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా.. మహేష్ నెక్ట్స్ చిత్రానికి భారీ క్రేజ్ ఉంటుంది. కారణం మహేష్ ఫాలోయింగే. అలాంటి మహేష్ లగ్జరీగానే ఉంటాడు. అలాగే ఫ్యామిలీకి బాగా ప్రాధాన్యతనిస్తారు. ఇక మహేష్ షూటింగ్ గ్యాప్ లో తన సొంత క్యారవాన్ లో సేద తీరుతాడు. టాలీవుడ్ లో లగ్జరీ క్యారవాన్ ఉన్నది మహేష్ కే. ఆ క్యారవాన్ లో సకల సౌకర్యాలు అంటే కాస్ట్లీ టీవీ, బెడ్, ఇతర అన్ని సౌకర్యాలూ కాస్ట్లీవే ఉంటాయి. చాలాకాలం క్రితం మహేష్ బాబు ఆ క్యారవాన్ ని 3 నుండి 4 కోట్ల వరకు ఖర్చు పెట్టి తెప్పించినట్లుగా చెబుతారు. ఇక కాస్ట్లీ క్యారవాన్ లో మహేష్ హాయిగా సేద తీరుతాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ వంతు

అయితే ఇప్పుడు మహేష్ క్యారవాన్ కన్నా చాలా కాస్ట్లీ క్యారవాన్ ఒకటి టాలీవుడ్ కి రాబోతుంది. అది కూడా అల్లు వారి హీరో కోసం. అల్లు అర్జున్ కూడా ఒక కాస్ట్లీ క్యారవాన్ ని కొన్నాడనేది లేటెస్ట్ న్యూస్. మహేష్ క్యారవాన్ కన్నా సకల సౌకర్యాలు ఉన్న క్యారవాన్ ని అల్లు అర్జున్ కొనుగోలు చేశాడని, దాని విలువ 7 కోట్లుగా చెబుతున్నారు. అల్లు అర్జున్ తెప్పించుకుంటున్న క్యారవాన్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరింది. ఇక అంత కాస్ట్లీ క్యారవాన్ సొంతం చేసుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ సెలబ్రిటీ అల్లు అర్జున్ అని చెబుతున్నారు.

Tags:    

Similar News