ఫ్యాన్స్ ను భయపెడుతున్న మహేష్ మూవీ టైటిల్..!

Update: 2018-08-07 09:58 GMT

మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహేష్ 25 చిత్రం లేటెస్ట్ గా మొదటి షెడ్యూల్ ను పూరిత చేసుకుంది. ఈ సినిమాకు 'రిషి' అనే టైటిల్ పెడుతున్నారని సోషల్ మీడియాలో గత వారం రోజులు నుండి ప్రచారం జరుగుతుంది. దీంతో ఫ్యాన్స్ లో ఈ రెండు అక్షరాల టైటిల్ అంటే అమ్మో అని లోలోపల మధనపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రెండు అక్షరాలు కలిసిరావా..?

ఎందుకంటే మహేష్ కు రెండు అక్షరాల టైటిల్స్ కలిసిరావని పాత లెక్కలు చూస్తే మీకే అర్ధం అవుతుంది. మహేష్ కెరీర్ లోనే డిజాస్టర్స్ గా నిలిచినా సినిమాలు అన్ని రెండు అక్షరాలతో ఉన్నాయి. 'బాబీ', 'నాని', 'వంశీ', 'నిజం' సినిమాలు అన్నీ రెండు అక్షరాల టైటిళ్లే. నిజానికి మహేష్ కు మూడు అక్షరాల టైటిల్స్ అయితే బాగా అచ్చు వచ్చింది. కాకపోతే ఇందులో సగం హిట్స్ ఉన్నాయి.. .సగం ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచినా చిత్రాలు అన్ని మూడు అక్షరాల టైటిళ్లే. 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి', 'దూకుడు' ఇలా.

మహేష్ పుట్టినరోజు వరకు ఆగాల్సిందే...

దీంతో 'రిషి' అనే టైటిల్ మహేష్ కు అచ్చి రాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మరోపక్క ప్రచారం ఏటంటే 'రిషి' అనేది మహేష్ పాత్ర పేరని.. సినిమా టైటిల్ వేరేది అని ప్రచారం జరుగుతుంది. మరి ఆ టైటిల్ ఏంటో మహేష్ బర్త్ డే రోజు రివీల్ చేయనున్నారు మేకర్స్.

Similar News