‘సిల్లీఫెలోస్’ని సపోర్ట్ చేస్తున్న మహేష్ బాబు

Update: 2018-08-27 06:16 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేతుల మీదుగా సిల్లీఫెలోస్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భీమినేని శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంతోనే సునీల్ కమెడియ‌న్ గా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు సునీల్. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, హేమ లాంటి న‌టులు కూడా స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తమ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన మ‌హేశ్ బాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది సిల్లీఫెలోస్.

న‌టీన‌టులు:

అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌, చ‌ల‌ప‌తిరావు, అదుర్స్ ర‌ఘు, ఝాన్సీ, హేమ త‌దిత‌రులు

Similar News