మహేష్ పక్కన చందమామ..?

Update: 2018-05-31 06:51 GMT

మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి తో ఒక సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. మహేష్ బాబు, వంశి సినిమా షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ తో తన 26 వ చిత్రాన్ని చెయ్యడానికి మహేష్ కమిట్ అయ్యాడు. ఇక సుకుమార్ అప్పుడే మహేష్ తో చెయ్యబోయే సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నాడనే టాక్ ఉంది. సుకుమార్ సినిమా పూర్తికాగానే మహేష్ బాబు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ ఒంగా తో మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మహేష్ - సందీప్ వంగా సినిమా పక్కా అనేది లేటెస్ట్ న్యూస్.

అభయం ఇచ్చిన నమ్రత..

అయితే సందీప్ వంగా తో సినిమా చెయ్యడానికి మహేష్ నామమాత్రంగా భరోసా ఇస్తే మహేష్ వైఫ్ నమ్రత మాత్రం డైరెక్టర్‌కి అభయం ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. ముందుగా సందీప్ వంగ మహేష్ ని కలిసి స్టోరీ లైన్ వినిపించారని, ఆ తర్వాత సందీప్ వంగా నమ్రతను కలిసి కథ మొత్తం పూర్తిగా చెప్పినట్టుగా చెబుతున్నారు. ఇక కథ విన్న నమ్రత... ఇలాంటి కేరెక్టర్ మహేష్ గతంలో చేయకపోవడం... అలాగే స్టోరీ కూడా బాగుందని ఆమె చెప్పిందట. అంతేకాదు త్వరలో కలిసి పనిచేద్దామని చెప్పడంతో సందీప్ హ్యాపీగా ఫీలయ్యాడని చెబుతున్నారు.

కాజల్ నే ఫైనల్ చేశారా..?

ఇక పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న సందీప్ వంగాకి ఈ సినిమాలో మహేష్ పక్కన కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని మహేష్ కి చెప్పడంతో ఆయన కూడా కాజల్ పట్ల సానుకూలంగా స్పందించాడట. మహేష్ పక్కన సందీప్ వంగా సినిమాలో దాదాపుగా హీరోయిన్ గా కాజల్ ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ - మహేష్ లు కలిసి బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం చిత్రాలలో నటించారు. మరి అందులో బిజినెస్ మ్యాన్ హిట్ కాగా.. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయ్యింది.

Similar News