ఒక్క సినిమాతో ముగ్గురికి సెటిల్ చేసేసాడు..!

Update: 2018-06-27 06:35 GMT

మహేష్ 25 వ చిత్రానికి వచ్చిన సమస్యలు మహేష్ కెరీర్ లోనే ఏ మూవీ కి వచ్చి ఉండవు. మహేష్ - వంశీ పైడిపల్లిల మూవీ పీవీపీ నిర్మాణంలో చెయ్యాల్సి ఉండగా.. మధ్యలోకి తెలివిగా దిల్ రాజు వచ్చాడు. ఇక ఎప్పటినుండో అశ్వినీదత్, మహేష్ కోసం కాచుకుని కూర్చీవడం.. కానీ సినిమాకి పెట్టుబడి పెట్టే కెపాసిటీ లేకపోవడంతో మహేష్... అశ్వినిదత్ కి తన 25 వ సినిమాని సమర్పకుడిగా చేసుకున్నాడు. ఇక వైజయంతి మూవీస్ సమర్పణలో దిల్ రాజు నిర్మాతగా మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమాని మొదలు పెట్టాడు. అయితే వంశీ సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ సిట్టింగ్ పూర్తయ్యి, నటీనటుల ఎంపిక జరిగినప్పటికీ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో వైజయంతి మూవీస్ లో మహానటి చెయ్యడం... ఆశ్వినిదత్ తాను కూడా నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పడం... కక్కలేక మింగలేకుండా ఉన్నదిల్ రాజు నిర్మించే ఈ మూవీ మీద పీవీపీ కేసు వెయ్యడంతో ఈ సినిమాకి సమస్యలు చుట్టుముట్టాయి.

పారితోషకం తగ్గించుకుని మరీ...

ఎలాగో పీవీపీని దారికి తెచ్చుకుని అశ్వినిదత్, దిల్ రాజులు మహేష్ 25వ మూవీకి మరొక నిర్మాతగా చేర్చుకున్నారు. ఇక ముగ్గురు నిర్మాతలు ఒకే సినిమాని నిర్మించడం అంటే.. ఆ సినిమాకి లాభాలు పెద్దగా ఉండవు. అసలే దిల్ రాజు అశ్వినిదత్ విషయంలోనే గుర్రుగా ఉంటే.. ఇప్పుడు పీవీపీ రావడం మరో సమస్య అయ్యింది. మరి ముగ్గురు నిర్మాతల వలన సినిమాకి లాభాలు పెద్దగా ఉండవని నిర్మాతలు ముగ్గురు గగ్గోలు పెడుతుంటే.. చూడలేని మహేష్ తన పారితోషకాన్ని 25 శాతం వరకు తగ్గించుకున్నాడనే టాక్ ఉంది. మరి తన పారితోషకం తగ్గించుకోవడం వలన సినిమాకి బడ్జెట్ తగ్గుంది. అలాగే సినిమాకి ఉన్న క్రేజ్ తో భారీగా లాభాలు మూటగట్టుకుంటారు. అలా ముగ్గురు నిర్మాతల నెత్తిన మహేష్ పాలు పోసాడు.

ముగ్గురికి న్యాయం చేస్తున్నాడుగా...

మరి ఇలా పారితోషకాన్ని తన ముగ్గురు నిర్మాతల కోసం త్యాగం చేసినప్పటికీ... ఎలాగూ ముగ్గురు నిర్మాతలతో తనకున్న కమిట్మెంట్ ఒకే ఒక సినిమా తో తీరిపోవడం.. మాత్రం హెడేక్ లేని పని. ఇంతకుముందే అశ్వినిదత్ కి, పీవీపీకి చెరో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇవ్వడం.. ఇలా ఒకే సినిమా కి దిల్ రాజుతో పాటు వారిద్దరూ పనిచేయడంతో.. మహేష్ ఒకే ఒక్క సినిమాతో ముగ్గురుకి సెటిల్ చేసి పారేసాడు.

Similar News