సక్సెస్ సెలెబ్రేషన్స్ కి బదులుగా

Update: 2018-04-27 08:45 GMT

మహేష్ బాబు ఎన్నడూ లేనంతగా భారత అనే నెను ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేష్ బాబు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా ఈ సినిమా లో తన నటనతో అందరిని ఓవరాల్ గా మెప్పించిన మహేష్ బాబు భరత్ అనే నేను కల్కేషన్స్ తో నాన్ బాహుబలి రికార్డులను సృష్టిస్తున్నాడు. గత శుక్రవారం విడుదలైన భరత్ అనే నేను సినిమా కలెక్షన్స్ అదరగొట్టేస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్ లోనే అదరగొట్టే హిట్ కొట్టిన మహేష్... తన సినిమాలన్నిటిలో ఈ సినిమా లో తన నటన బావుందని చెప్పడమే కాదు... రెండు సినిమాల డిజాస్టర్స్ నుండి భరత్ అనే నేను తో కోలుకున్నానని కూడా చెప్పాడు.

ఇక సినిమా విడుదలకు ముందు విదేశాలకు చెక్కేసి హాయిగా గడిపొచ్చిన మహేష్ సినిమా విడుదలకు రెండ్రోజుల ముందు భరత్ అనే నేను ప్రమోషన్స్ తో అదరగొట్టేసాడు. అలాగే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోయాక కూడా థాంక్స్ మీట్, సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు. సినిమా విడుదలైనమూడు రోజులకే భరత్ థాంక్స్ మీట్ అంటూ చెప్పిన మహేష్ ఈ రోజు శుక్రవారం తిరుపతి వేదికగా భారత్ అనే నేను సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ అది అనుకోని కారణంగా వాయిదా పడడం తో మహేష్ ఇదే రోజు ఏపీలోని విజయవాడకి చేరుకొని కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకుని... విజయవాడ థియేటర్స్ లో అభిమానులతో కలిసి హంగామా చేయనున్నాడు.

మరి భరత్ అనే నేను సినిమాపై ఇంకా అంచనాలు, క్రేజ్ పెంచేందుకు గాను మహేష్, కొరటాల తో కలిసి ఇలా అభిమానులను కలవడం అవి ఇవి చేస్తున్నాడు. ఈ రకంగా భరత్ కి ఇంకా కలెక్షన్స్ పెరగడమే కాదు... సినిమాపై మరింత క్రేజ్ కూడా వస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు తన బావ జయదేవ్, కొరటాల వంటి వారితో కలిసి విజయవాడలో సందడి చేస్తునాడు.

Similar News