సీఎం పోస్టుపై మ‌హేష్ రియాక్ష‌న్ ఇదే

Update: 2018-04-07 17:32 GMT

తెలుగు సినిమా హీరోల‌కు రాజ‌కీయాల‌కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ విధంగా ఈ రెండు రంగాల‌కు ఇంత లింక‌ప్ అవ్వ‌డానికి కార‌ణం టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆరే అని చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా రంగంలో స్టార్ హీరోగా ఎదిగి పార్టీ పెట్టి సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత అదే సినిమా రంగం నుంచి వ‌చ్చిన ఎంతో మంది వివిధ ప‌ద‌వులు చేప‌ట్టారు.

ప్ర‌స్తుతం తెలుగు రాజ‌కీయాల్లో ఉన్న సినిమా వాళ్ల‌కు లెక్కే లేదు. దీంతో స‌హ‌జంగానే తెలుగు సినిమాల్లో పొలిటిక‌ల్ నేప‌థ్యంలో సినిమాలు వ‌స్తున్నాయంటే స‌హ‌జంగానే హాట్ టాపిక్ అవుతుంది. ఇక మ‌హేష్‌బాబు హీరోగా తాజాగా వ‌స్తోన్న భ‌ర‌త్ అను నేను సినిమా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా. ఈ సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ పేరు భ‌ర‌త్. సీఎం రోల్‌లో క‌నిపిస్తాడు.

మ‌హేష్ చూస్తే ల‌వ‌ర్‌బాయ్‌.. మ‌నోడు సీఎం క్యారెక్ట‌ర్‌లో ఎలా షూట్ అవుతాడో ? అన్న సందేహం అంద‌రికి ఉంది. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స్టోరీ చెప్పిన‌ప్పుడు ఏకంగా 5 గంట‌ల టైం తీసుకున్నాడ‌ట‌. క‌థ విన్న మ‌హేష్ సినిమా ఐదు గంట‌లు ఉంటుందా ? అని అడ‌గ‌డంతో శివ షాక్ అయ్యాడ‌ట‌. అంటే క‌థ మ‌హేష్‌కు ఆ రేంజ్‌లో న‌చ్చింద‌ట‌. ఇక రాజ‌కీయాలంటే త‌న స్వ‌భావానికి అస్స‌లు ప‌డ‌వ‌ని మ‌హేష్ మ‌రోసారి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు.

రాజ‌కీయాలు న‌చ్చ‌ని మ‌హేష్‌కు సీఎం క్యారెక్ట‌ర్‌లో చేయాల‌ని ద‌ర్శ‌కుడు శివ చెప్పిన‌ప్పుడు మ‌హేష్‌లో తెలియ‌ని వ‌ణుకు కూడా మొద‌లైంద‌ట‌. చివ‌ర‌కు శివ చెప్పిన స్టోరీ మొత్తం విన్నాక సినిమాపై న‌మ్మ‌కం వ‌చ్చింద‌న్నాడు. ఇక‌పై తెలుగు సినిమా హీరోల ఫంక్ష‌న్ల విష‌యంలో ట్రెండ్ మారుతుంద‌ని... ప్ర‌తి ఒక్క హీరో ఫంక్ష‌న్‌కు మిగిలిన హీరోలు అంద‌రూ వ‌స్తార‌ని.. తాము ఎప్పుడూ బాగానే ఉంటామ‌ని... మీరు ఇంకా బాగుండాలని ఫ్యాన్స్ మ‌ధ్య వైరుధ్యాలు వ‌ద్ద‌ని ప‌రోక్షంగా చెప్పాడు.

Similar News