మహేష్ కోసం ఎన్టీఆర్ అందుకే వచ్చాడు!!

Update: 2018-04-15 11:00 GMT

మహేష్ బాబు - కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భరత్ అనే నేను మీద భారీ హైప్ ఉంది. వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీ క్రేజ్ తెచ్చింది చిత్ర బృందం. స్టార్ హీరో ఎన్టీఆర్ ని ముఖ్య అతిధిగా పిలిచి సినిమాపై భారీ క్రేజ్ తీసుకొచ్చింది చిత్ర బృందం. ఒక స్టార్ హీరో ఈవెంట్ కి మరో స్టార్ హీరో రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడున్న స్టార్ హీరోల మధ్య స్నేహ సంబంధాలు బావుంటున్నాయి. అయితే అసలు సడెన్ గా భరత్ అనే నేను సినిమాకి ఎన్టీఆర్ ని ఎందుకు పిలిచారో అనే విషయాన్నీ ప్రస్తుతం భరత్ అనే నేను ఇంటర్వూ ల్లో దర్శకుడు కొరటాల ఒక ముచ్చట చెప్పాడు.

జోక్ చేస్తున్నారా? అన్న ఎన్టీఆర్.....

భరత్ అనే నేను సినిమా ప్రి రిలీజ్ వేడుకని మొదట్లో ఏపీలోని వైజాగ్ లో చెయ్యాలనుకున్నప్పటికీ చివరికి అది హైదరాబాద్ లో ఫిక్స్ అవడంతో... కొరటాల శివతో సంవత్సరం మొత్తం మన ఫేస్ లే చూసుకున్నాం. సినిమా ఫంక్షన్ కు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది కదా అని మహేష్ బాబు, చెప్పడంతో.. ఎవరిని పిలుద్దాం అని కొరటాల, మహేష్ తో పాటు భరత్ టీమ్ కూడా బాగా ఆలోచించింది. అదే టైం లో తారక్ ని పిలుద్దామని మహేష్ చెప్పడంతో .... వెంటనే నేను తారక్ కి ఈ భరత్ అనే నేను ఈవెంట్ గురించి చెప్పి... అతిధిగా రమ్మని పిలిస్తే... ఊరుకోండి... జోక్ చేస్తున్నారా అని అనేసాడట.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.

రెండు గంటల పాటు.....

జోక్ కాదు నిజంగా రావాలని అడిగితే... వెంటనే ఒప్పేసుకుని.. సరే నాకు రెండు గంటల పాటు ఎంజాయ్ చేసే అవకాశం కలుగుతుంది అంటూ భరత్ అనే నేను ఈవెంట్ కి వచ్చేసాడట ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ మహేష్ కోసం, కొరటాల కోసం ఆ ఈవెంట్ కి వచ్చి అక్కడ స్టేజ్ మీద సూపర్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి కొరటాల శివ కి ఎన్టీఆర్ ఫ్రెండ్. కొరటాల, ఎన్టీఆర్ ని పిలిస్తే... వచ్చాడంటే .. పెద్ద విశేషమేమీ ఉండేది కాదు. కానీ ఒక స్టార్ హీరో అయిన మహేష్ తన ఈవెంట్ కోసం ఎన్టీఆర్ పేరును సజెస్ట్ చెయ్యడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ రావడం తమకు ప్లస్ అయ్యిందని కొరటాల చెప్పాడు.

Similar News