సరికొత్త 'లుక్' తో మహేష్?

Update: 2018-05-22 08:53 GMT

మహేష్ ప్రతి సినిమాలోనూ ఒకే విధంగా కనిపిస్తున్నాడని విమర్శ ఉంది. అయితే దానికి కౌంటర్ ఇవ్వాలని మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా కోసం ఇంతవరకు కనిపించని విధంగా కనిపించబోతున్నాడంట. ఎన్టీఆర్ 'అరవింద సమేత' కోసం ఫిట్‌గా తయారైనట్టు మహేష్ ఈ చిత్రం కోసం వర్క్ ఔట్స్ చేయబోతున్నాడట.

ఫిజికల్ ఫిట్ నెస్ కూడా...

'భరత్ అనే నేను' సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో టూర్ వెళ్లిన మహేష్ ఇంకా తిరిగి రాలేదు. తిరిగి వచ్చాక పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకుని వర్కవుట్స్‌ మొదలు పెడతాడట. కేవలం ఫిజికల్‌గానే కాకుండా లుక్స్‌ పరంగాను మహేష్‌ ఇందులో కొత్తదనం చూపిస్తాడట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తొందర ఎందుకు టైం తీసుకుని చేద్దాం అని మహేష్ చెప్పాడంట.

సెంటిమెంట్ కోసమే సమ్మర్ వరకు...

సో వచ్చే సమ్మర్ కి సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నారు టీం. ఈ సినిమాకి దిల్ రాజు, అశ్వనీదత్‌ నిర్మాతలు. సమ్మర్ లో వచ్చిన 'పోకిరి', 'భరత్ అనే నేను' సినిమాలు హిట్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాని కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారంట.

Similar News