మహేశ్ కి ఈ లుక్ బాగా లేదా..?

Update: 2018-07-02 06:31 GMT

ప్రస్తుతం మహేష్ న్యూ లుక్ తో కొత్తగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తన 25వ మూవీ కి శ్రీకారం చుట్టాడు. భరత్ అనే నేను హిట్ తో ఊపు మీదున్న మహేష్ బాబు వంశీ సినిమాతోనూ హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లిన మహేష్ న్యూ లుక్ కొన్ని లీకెడ్ ఫొటోల ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అలాగే తన బావ కోసం సమ్మోహనం ఈవెంట్ కి మహేష్ కొత్త లుక్ తోనే వచ్చాడు. అసలు అప్పుడే మహేష్ న్యూ లుక్ కి అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా అల్లరి నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో అదే లుక్ తో హాజరయాయడు. మహేష్ 25వ మూవీలో స్టూడెంట్ లుక్ అదే అంటున్నారు. ఇక ఈ సినిమా లో కీలకమైన మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుకలను డెహ్రాడూన్ లోని ఒక రెస్టారెంట్ లో సెలెబ్రేట్ చేశారు. ఈ వేడుకకి వంశీ పైడిపల్లి, పూజ హెగ్డే, మహేష్... స్పెషల్ గెస్ట్ గా అల్లరి నరేష్ కూతురు కూడా వచ్చింది. ఇక నరేష్ కూడా ప్రస్తుతం మహేష్ సినిమా కోసం డెహ్రాడూన్ లోనే ఉండడంతో... నరేష్ తన పుట్టిన రోజుని అక్కడే యూనిట్ సభ్యుల మధ్యన సెలెబ్రేట్ చేసుకున్నాడు.

ఇలా ఉన్నాడేంటీ..?

ఇకపోతే మహేష్ అలా చిన్న గెడ్డం, హెయిర్ స్టయిల్ పక్కకి దువ్వుకుని క్యూట్ గానే ఉన్నప్పటికీ... ఇప్పటివరకు అందరూ మహేష్ రొటీన్ లుక్ కే అలవాటు పడిపోయారు. మరి ఈ సినిమాలో మహేష్ ఇలా కొత్తగా ట్రై చెయ్యడంతో అసలు ఆ లుక్ వర్కౌట్ అవుతుందా అనే అనుమానం మాత్రం కొందరిలో తలెత్తింది. ఎందుకంటే ఆ న్యూ లుక్ లో మహేష్ కాస్త ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తున్నాడు. ఎందుకో ఆ లుక్ తేడా కొట్టొచ్చు అనే అనుమానం మహేష్ అభిమానుల్లో వస్తుందనే టాక్ వినిపిస్తుంది. మరి బాడీ ఫిట్ గా ఉన్నప్పటికీ మహేష్ అలా టి షర్ట్ లో అంతగా బాగోలేదని.. కాస్త చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుందని అంటున్నారు. మరి గతంలో మహేష్ బాబు సైనికుడు సినిమా లో రఫ్ గా గెడ్డం పెంచినా.. స్టూడెంట్ లుక్ లో మహేష్ లుక్ సూపర్ గా అనిపించిందని.. ఆ సినిమా పోయినప్పటికీ మహేష్ లుక్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసాడని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా లో మహేష్ కొత్త లుక్ ఎక్కువసేపు లేకపోతె బాగుండును అనే కామెంట్స్ పడుతున్నాయి.

Similar News