కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తాడట..!

Update: 2018-06-26 06:06 GMT

ఈ వయసులోనూ యంగ్ లుక్స్ తో చంపేస్తున్న మహేష్ బాబును ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్ అంటే ఎవరైనా నమ్మేస్తారు. నూనూగు మీసాల కుర్రాడిలా.. ఫార్మల్ షర్ట్స్ తో అదరగొట్టే మహేష్ ఎప్పుడూ కొత్తగా ట్రై చెయ్యడు. పోకిరి వంటి మాస్ సినిమా లో గెడ్డం పెంచి మాస్ గా కనబడినా, ఆ తర్వాత మహేష్ ఎక్కువగా ఒకే లుక్ ని, ఒకే రకమైన డ్రెస్ సెన్స్ ని మెయింటింగ్ చేస్తూ వచ్చాడు. అయితే శ్రీమంతుడులో లుంగీతో అదరగొట్టిన మహేష్ భారత అనే నేను లో పంచె కట్టుతో కిర్రెకించాడు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కెరీర్ లోనే మైలు రాయి అయిన తన 25వ చిత్రాన్ని చేస్తున్నాడు.

కొత్త లుక్ లో అదరగొడుతున్నాడు

ప్రస్తుతం డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ బాబు అర్ధ భాగం కాలేజి కుర్రాడు గెటప్ లో కనిపిస్తాడట. అందుకే గెడ్డం కాస్త స్టయిలిష్ గా పెంచిన మహేష్ తన రెగ్యులర్ ప్లయిన్ షర్ట్స్ లో కాకుండా చెక్ షర్ట్స్ ఉండేలా కొత్తగా ప్లాన్ చేశారట. మరి ఎప్పుడూ ప్లైన్, ఫార్మల్ షర్ట్స్ లో కనబడే మహేష్ బాబు తాజాగా సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే... చెక్స్ షర్ట్ తో పక్క పాపిడి తీసి జుట్టు పక్కకి దువ్వి .. రఫ్ గా గెడ్డం పెంచి మంచి స్టైలిష్ లుక్ లోకొచ్చేసాడు. మరి ఇప్పడు సినిమాలో కూడా మహేష్ గళ్ళ చొక్కా, రఫ్ గెడ్డం, పక్క పాపిడితో కొత్తగా ట్రెండ్ చేస్తాడట.

 

Similar News