మహేష్ ఏంటి ఇలా

Update: 2018-04-23 04:38 GMT

మహేష్ భరత్ అనే నేను సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మహేష్ బాబు విడుదలకు ముందే ఈ సినిమా పై పిచ్చ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. మహేష్ కాన్ఫిడెంట్ ని సినిమా విజయం నిలబెట్టింది. ఇప్పటికే రంగస్థలం కలెక్షన్స్ దాటుకుని నాన్ బాహుబలి రికార్డులని సృష్టించడంతో మహేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమా విడుదలకు ముందే సినిమా మీద ఉన్న నమ్మకంతో విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేసాడు. ఇక సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ కి వచ్చి ఇంటర్వూస్ లో పాల్గొన్న మహేష్ సినిమా హిట్ టాక్ తో భార్యతో కలిసి పండగ చేసుకుంటున్నాడు.

అయితే మహేష్ ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడడు. కానీ నమ్రత మాత్రం తాను మహేష్ పిల్లల్తో ఎలా స్పెండ్ చేస్తారో అనే విషయాన్నీ మాత్రం సోషల్ మిడియా లో పోస్ట్ చేసి అభిమానులకు అందిస్తుంది. అయితే తాజాగా మహేష్ ఇప్పుడు ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరి ఆ పిక్ అలాంటి ఇలాంటి పిక్ కాదు. మహేష్ బాబు తన భార్య నమ్రతకు లిప్ లాక్ కిస్ ఇస్తున్న ఫోటో అది. ప్రస్తుతం ఆ ఫోటో సాంఘీక మద్యమాలలో తెగ వైరల్ అయ్యింది. ఇక మహేష్ ఆ అందమైన ఫోటో తోపాటుగా ‘థ్యాంక్యూ మై లవ్’ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.

మరి ఎంతో మొహమాటస్తుడు. ఎప్పుడూ సినిమాల విషయంలో మహేష్ వాలకం వేరు. బయట మహేష్ వేరు. ఎవరితోనైనా కొంచెం తక్కువగా మాట్లాడే మహేష్ తన పర్సనల్ విషయాలను అస్సలు చెప్పడు. చాలా సిగ్గరి. మరి అలాంటి మహేష్ భరత్ అనే నేను హిట్ కొట్టడంతో మైమరచిపోయి భార్యతో తాను గడిపిన అందమైన క్షణాలను అలా పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇక మహేష్ , నమ్రతల పిక్ చూసి అబ్బా మహేష్ ఇలా ఎప్పుడూ లేడే. అని ఇప్పుడు విజయాన్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాడన్నమాట.

Similar News