మహర్షి శాటిలైట్స్ విషయం లో ఇంత జరిగిందా!!

Update: 2018-10-18 06:27 GMT

వంశి పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ తన 25 వ సినిమా మహర్షిని జులై నెలలో మొదలు పెట్టాడు. గత ఏడాదే ఓపెనింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా జూన్ నుండే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాల్సి ఉండగా.... ఈ సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లు మధ్యలో విభేదాలు రావడంతో... సినిమా షూటింగ్ మొదలవడానికి ఒక నెల టైం తీసుకుంది. తర్వాత దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లు కాంప్రమైజ్ అవడంతో షూటింగ్ ఊపందుకుంది.

శాటిలైట్ హక్కుల విషయంలో.....

ఇప్పుడు తాజాగా మహర్షి శాటిలైట్స్ హక్కుల విషయంలోనూ ఒక గందరగోళం జరిగింది. ఈ మహర్షి శాటిలైట్స్ హక్కులు ముందుగా జీ ఛానల్ కి దక్కింది అనుకున్న టైం లో మరో పెద్ద ఛానల్ అయిన జెమిని ఛానల్ మహర్షి శాటిలైట్ హక్కులను చేజిక్కించుకుంది. మహేష్ స్పైడర్ విషయంలో జీ తెలుగు చాలా తెలివిగా శాటిలైట్స్ హక్కులను దక్కించుకున్నట్టుగా.. మహర్షి విషయంలోనూ జీ ఛానల్ ఎత్తుగడ వెయ్యడం.... లాస్ట్ మినిట్ లో అది కాస్తా తేడా కొట్టి జెమిని చేతికి మహర్షి శాటిలైట్ హక్కులు వెళ్లడం జరిగాయట.

దిల్ రాజు అంగీకరించకపోవడంతో....

అశ్వినీదత్ అండతో జీ తెలుగు ఛానల్ మహర్షి సినిమా శాటిలైట్ హక్కులు తో పాటుగా... డిజిటల్ హక్కులను దక్కించుకోవాలనుకుంటే... దిల్ రాజు మాత్రం జీ ఛానల్ కి డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులలో డిజిటల్ హక్కులు ఇవ్వడానికి ఒప్పుకోలేదట. ఇక దిల్ రాజు లాబీయింగ్ తో జెమిని వారు చివరికి ఫ్యాన్సీ రేటుకి మహర్షి శాటిలైట్ హక్కులను చేజిక్కించుకుంది. జీ ఛానల్ కి దిల్ రాజు మధ్య ఏదో విభేదాలతో మహర్షి శాటిలైట్ ని దిల్ రాజు జెమిని కట్టబెట్టడంటున్నారు. మరి మొదట్లో వైజయంతి మూవీస్ లో మహర్షి మూవీ తెరకెక్కి అశ్వినీదత్ కేవలం సమర్పకుడిగా మాత్రమే ఉండాల్సింది.. చివరికి దిల్ రాజుతో పాటుగా నిర్మాతగా మారారు. అలాగే పివిపి కూడా మహేష్ సినిమాకి పట్టుబట్టి నిర్మాత అయ్యాడు. అవన్నీ ఇష్టం లేని దిల్ రాజు సైలెంట్ అవగా... ఇక తాజాగా దిల్ రాజు అనుకున్నది ఇక్కడ మహేష్ మహర్షి శాటిలైట్ హక్కుల విషయంలో జరిగింది.

Similar News