మహేష్ లుక్ అదిరిపోయింది..!

Update: 2018-10-23 07:13 GMT

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 'మహర్షి' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మహేష్ ను తొలిసారి డైరెక్ట్ చేస్తున్న వంశీ ఇందులో మహేష్ ను చాలా కొత్తగా చూపించనున్నాడు. రీసెంట్ గా లీక్ అయిన ఫొటోస్ చూస్తేనే ఈ విషయం అర్ధం అవుతుంది. లీక్ అయిన పిక్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా మహేష్ ఆల్ట్రా స్టైలిష్ లుక్‌ తో దర్శనమిచ్చాడు. సూటు, బూటులో గాగుల్స్ పెట్టి మల్టీ మిలియనీర్ మాదిరిగా కనపడుతున్నాడు. క్లాస్ ప్లస్ మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా మహేష్ లుక్స్ ఉంటాయని చెబుతున్నారు. మహేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎపిసోడ్స్ కోసం షూట్ చేస్తున్నారు.అక్కడ నుండే ఈ పిక్స్ లీక్ అయ్యాయి.

అమెరికా నుంచి తెలంగాణ పల్లెకు...

అమెరికాలో ఉండే మహేష్.. అల్లరి నరేష్ కి సంబంధించిన విషయం కోసం అమెరికా నుంచి తెలంగాణలోని ఓ పల్లెటూరికి వస్తాడట. ఇక్కడ నుంచి హైవోల్టేజ్ ఎమోషన్‌తో పాటు యాక్షన్ డ్రామా ఓ రేంజ్‌లో ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది. మహేష్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

Similar News