మహేష్ తో కొరటాల… దర్శకుడిగా కాదు

మహేష్ బాబు – కొరటాల శివ ది హిట్ కాంబినేషన్. వారి కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అయితే భరత్ అనే నేను హిట్ [more]

Update: 2019-05-30 05:07 GMT

మహేష్ బాబు – కొరటాల శివ ది హిట్ కాంబినేషన్. వారి కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అయితే భరత్ అనే నేను హిట్ అయ్యింది. మహర్షి సినిమా యావరేజ్ హిట్ తో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు తన 26 వ చిత్రాన్ని ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి తో చెయ్యబోతున్నాడు. రేపో మాపో మొదలు కాబోతున్న అనిల్ – మహేష్ కాంబో చిత్రం జూన్ నెలాఖరునుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. ఇక అనిల్ సినిమా తర్వాత మహేష్ తన 27 వ చిత్రాన్ని సందీప్ వంగాతో చేస్తాడా? గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ తో చేస్తాడా? అనే దానికి ప్రస్తుతం సందీప్ వంగ సైడ్ అయ్యి… లైన్ లోకి పరశురామ్ వచ్చాడు. పరశురామ్ మహేష్ కి ఓ కథ వినిపించగా మహేష్ దానికి సానుకూలంగా స్పందించినట్లుగా ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

అయితే పరశురామ్ – మహేష్ చిత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కాల్సి ఉంది. ఎందుకంటే గీత గోవిందం హిట్ తర్వాత పరశురామ్ గీత ఆర్ట్స్ లోనే మరో మూవీ చేస్తానని మాటిచ్చాడు. అయితే తాజాగా పరుశురాం – మహేష్ కాంబో మూవీపై ఆసక్తి చూపిస్తున్న కొరటాల శివ తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి సుధా ఆర్ట్స్ లో ఈ ప్రాజెక్టును నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియా టాక్. మరి కొరటాలకు ఇంట్రెస్ట్ ఉంటే… పరశురామ్ గీత ఆర్ట్స్ ని వదిలి రావాలంటే కుదిరే పనికాదు. మరి మహేష్ ఎమన్నా ఒప్పించి కొరటాల కు నిర్మాతగా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. ఫైనల్ గా మహేష్ – పరశురామ్ మూవీ నిర్మాత ఎవరో అనేది ప్రస్తుతానికున్న సస్పెన్స్.

Tags:    

Similar News