ఇది జరిగే పనేనా?

Update: 2018-06-27 06:16 GMT

కొన్ని రూమర్స్ ఎందుకు పుడతాయి.. అవి ఎందుకు నిజానికన్నా ఎక్కువగా ప్రయాణిస్తాయో తెలియదు. రూమర్స్ పుట్టినప్పుడు... అవి నిజమనే స్థాయిలోనే స్ప్రెడ్ అవుతాయి. కానీ కొన్ని రూమర్స్ మాత్రం బయటికి రాగానే చెక్ పెట్టేస్తారు కొందరు. తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే... బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్.. కృష్ణ పాత్ర చేస్తున్నాడనే న్యూస్ నిన్నటి నుండి తెగ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం భారీ బడ్జెట్, భారీ హంగులతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ తో పాటు నటీనటుల ఎంపిక మొదలు పెట్టిన క్రిష్ ఒక్కో నటుల్ని ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం చేస్తున్నాడు.

ఎన్టీఆర్ తో కృష్ణకు విభేదాలు ఉండేవా..?

ఇప్పటికే విద్యబాలన్ ని బసవతారకం పాత్రకి ఎంపిక చేసిన క్రిష్, రానాని చంద్రబాబు పాత్రకి తీసుకున్నాడని టాక్ ఉంది. ఇక ఏఎన్నార్ పాత్రకి నాగ చైతన్యని తీసుకుంటున్నారని చెబుతున్న వారు ఇప్పుడు కృష్ణ పాత్రకి మహేష్ బాబుని సెలెక్ట్ చేస్తున్నారనే టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ నట జీవితంలో ఏఎన్నార్, కృష్ణ పాత్రలు చాలా కీలకం. అయితే కృష్ణ పాత్ర కోసం బాలకృష్ణ స్వయానా మహేష్ దగ్గరికి వెళ్లి మరి అడిగినట్లుగా ఫిలింసర్కిల్స్ లో గుసగుస లు వినబడుతున్నాయి. మరి రియల్ లైఫ్ లో ఎన్టీఆర్ కి, కృష్ణకి అసలు పడేది కాదనేది ఓపెన్ టాక్. మెయిన్ గా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ పద్ధతులు నచ్చక ఎన్టీఆర్ ని, పార్టీని విమర్శిస్తూ తన సినిమాల్లో భారీ డైలాగ్స్ పేల్చేవాడు .

కృష్ణ ఒప్పుకుంటారా..?

కానీ నట జీవితంలో మాత్రం ఎన్టీఆర్ కి, కృష్ణ కి కొన్నిసార్లు మంచి అనుబంధం ఉంది. సినిమాల్లో చేసేటప్పుడు మనస్పర్థలు వచ్చినా.. అవి త్వరగానే సమసిపోయాయి. అదే గొడవలు ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో భగ్గుమనడం... ఇలా అనేక రకాల విభేదాలు కృష్ణకి ఎన్టీఆర్ కి మధ్యన నడిచాయి. ఇక తాజాగా కృష్ణ రోల్ లో మహేష్ నటిస్తాడంటే కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదంటే మహానటి బయోపిక్ లో చూపించినట్టుగా కృష్ణ కి ఎన్టీఆర్ కి మధ్యన ఉన్న అనుబంధాన్ని మహేష్ గెస్ట్ రోల్స్ తో ఫుల్ ఫీల్ చేసేస్తే.. మహేష్ ఏమైనా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి కృష్ణ తో బాలకృష్ణ కి అంత సయోధ్య ఉన్నట్లుగా కనబడదు. ఇలాంటి సిట్యువేషన్ లో మహేష్ ఎన్టీఆర్ బయోపిక్ లో భాగస్వామి అవుతాడా అంటే డౌటే? మరి ఇది ఒక రూమర్ గా మిగులుతుందా.. లేదంటే నిజమా అనేది మాత్రం క్లారిటీ రావడానికి చాలా సమయం పడుతుంది.

 

Similar News