మహేష్ ఇంత మంచోడా

Update: 2018-04-10 08:39 GMT

కొరటాల శివ తో కలిసి శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు .... మళ్ళీ కొరటాలతో కలిసి భరత్ అనే నేను సినిమా చేసాడు. ప్రస్తుతం భరత్ అనే నేను మార్కెట్ లో పిచ్చ హైప్ క్రియేట్ చేస్తుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఈ నెల 20 నే అంటే.. మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీతో కలిసి ఆడిపాడుతున్న మహేష్ బాబు యంగ్ సీఎం గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా చాలా బాగా వచ్చిందని... మళ్ళీ కొరటాల - మహేష్ లు కలిసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని.... భరత్ టీమ్ ముక్త కంఠంతో చెబుతుంది.

ఇక కొరటాల , మహేష్ భరత్ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ఇక భరత్ ఆడియో కూడా సూపర్ హిట్ అయింది. దేవిశ్రీ మ్యూజిక్ అందించిన భరత్ పాటలు అందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమా రష్ సూపర్ గా ఉందని చిత్ర టీమ్ ఇచ్చిన భరోసాతో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడట. సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్ తో మహేష్ బాబు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం కాస్ట్లీ ఐ ఫోన్ టెన్ గిఫ్ట్ లుగా ఇచ్చాడట. మరి మహేష్ బాబు మనసెంత మంచిదో కదా. తన కోసం అంతగా కష్టపడిన టీమ్ కోసం మహేష్ ఇలా ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం మాత్రం సూపర్.

అన్నట్టు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ కి అప్పట్లో మహేష్ బాబు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఇలా సినిమాలు హిట్ అయినప్పుడు ఆయా డైరెక్టర్స్ ఖరీదైన గిఫ్ట్స్ అందుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ... ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం కూడా ఖరీదైన గిఫ్ట్ లు పనిచేసిన మహేష్ మంచోడు అనిపించేసుకున్నాడుగా...!

Similar News