మహేష్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడంటే

Update: 2018-05-09 03:35 GMT

మహేష్ బాబుకి రెండు సినిమాలు డిజాస్టర్స్ రెండేళ్లుగా బాధ పెడుతున్నాయి. బ్రహ్మ్మోత్సవం, స్పైడర్ సినిమాల్తో బాగా దెబ్బతిన్న మహేష్ బాబు కొరటాల తో కలిసి కసిగా భరత్ అనే నేను హిట్ కొట్టాడు. భరత్ సినిమాతో తనకి హిట్ దాహం తీరడమే కాదు... తన రెండేళ్ల టెన్షన్ కూడా పోయిందని మహేష్ అందరికి చెప్పాడు. గతంలోనూ ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తనకి శ్రీమంతుడు తో మంచి లైఫ్ ఇచ్చాడు కొరటాల శివ. అప్పటినుండి కొరటాల, మహేష్ కి ఆత్మీయుడు అవడమే కాదు.. ఒక కాస్ట్లీ కారుని బహుమతిగా ఇచ్చి కొరటాలని కట్టిపడేసాడు. అలాగే మహేష్ మళ్ళీ భరత్ తో కొరటాలకు అవకాశం ఇవ్వడం.. అది కాస్త సక్సెస్ కావడం జరిగిపోయింది.

అయితే శ్రీమంతుడు టైం లో మహేష్, కొరటాలకి కాస్ట్లీ బహుమతి ఇచ్చినట్లే ఇప్పుడు భరత్ విజయానంతరం కూడా కొరటాలకు ఏదో మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నాడని.. కానీ అదేమిటో తెలియదనే ప్రచారం గత పదిహేను రోజులుగా జరుగుతూనే ఉంది. కానీ ఆ భారీ బహుమతి ఏమిటనే దాని మీద క్లారిటీ మాత్రం లేదు. ఇక మహేష్ సినిమా విడుదలకు ముందే ఐ ఫోన్స్ ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి గిఫ్ట్ లుగా ఇచ్చాడు. మరి అప్పుడే వారందరికీ అంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తే తనకి అద్భుతమైన హిట్ ఇచ్చిన కొరటాలకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో బీభత్సంగా జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తనకి ఇష్టమైన దర్శకుడు కొరటాలకు హైద్రాబాద్ పరిసరాల్లో ఓ లగ్జరీ విల్లాను బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విల్లా ఖరీదు భారీగానే ఉంటుందని.. ప్రస్తుతం సినీ జనాలు నివసిస్తున్న కాస్ట్లీ పోష్ విల్లాస్ లో ఇది కూడా ఒకటి అనే టాక్ వినిపిస్తోంది. మరి భరత్ కి పారితోషకం కింద బాగా తీసుకున్న కొరటాల ఇప్పుడు మహేష్ గిఫ్ట్ తో బోనస్ అందుకున్నట్టు ఉంది. మరి విల్లా రేటు బయటికి రాలేదుగాని... అది మాత్రం యమ కాస్ట్లీ అని తెలుస్తుంది. అయితే గతంలోనూ అంటే జనత గ్యారేజ్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ కూడా కొరటాలకు ఒక విల్లా ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది... కానీ క్లారిటీ లేదు.

Similar News