మహేష్ బాబు తో పెట్టుకుంటే…!

మహేష్ బాబు ని నమ్ముకుని సుకుమార్ దెబ్బైపోయాడు. కానీ సుకుమార్ ని అల్లు అర్జున్ ఆదుకున్నాడు. కానీ మహేష్ వదిలేసిన వంశి పైడిపల్లిని ఎవరు ఆదుకుంటారో తెలియదు. [more]

Update: 2020-04-26 06:39 GMT

మహేష్ బాబు ని నమ్ముకుని సుకుమార్ దెబ్బైపోయాడు. కానీ సుకుమార్ ని అల్లు అర్జున్ ఆదుకున్నాడు. కానీ మహేష్ వదిలేసిన వంశి పైడిపల్లిని ఎవరు ఆదుకుంటారో తెలియదు. మహేష్ ప్రస్తుతం కథ నచ్చకపోయినా.. తర్వాత చూద్దామని.. వంశి కి మాట ఇవ్వడం.. ప్రస్తుతం పరశురామ్ కి మహేష్ కనెక్ట్ అయినా.. పరశురామ్ తర్వాత వంశి కి అవకాశం వస్తుంది అని ఆశ పడ్డాడు. కానీ మధ్యలో రాజమౌళి వచ్చి మహేష్ తో సినిమా అన్నాడు. RRR తర్వాత మహేష్ రాజమౌళి మూవీ పక్కా. మరి రాజమౌళి తో సినిమా అన్నాక వంశి పరిస్థితి… అది దేవుడికే తెలియాలి మరి.

రాజమౌళి అలా మహేష్ తో సినిమా అన్నాడో లేదో… ఇలా వంశి పైడిపల్లి మహేష్ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ పరశురామ్ పక్కా కథతో మహేష్ తో సినిమా మొదలయితే… తర్వాత రాజమౌళి RRR పూర్తవగానే మహేష్ రెండేళ్లు లాక్. మరి వంశి పైడిపల్లి ఈలోపు మహేష్ నే నమ్ముకుని కథలు రాస్తే కష్టం.మధ్యలో మరో హీరో ని వెతుక్కోవాల్సిందే. కానీ వంశి మాత్రం మహేష్ కేవలం చూద్దాం అన్నమాట పట్టుకుని మహేష్ కి చెప్పిన కథనే చెక్కుతున్నాడు. మరి మహేష్ గనక మాటిచ్చాడు గనక పరశురామ్ తో సినిమా టకటకా పూర్తి చేసి… వంశీతో సినిమా చేస్తే ఓకె.. లేదంటే వంశి పరిస్థితి అగమ్య గోచరమే. 

Tags:    

Similar News