మహేష్ కి ఆ దర్శకులపై కోపమెందుకు..?

మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో తన 25 వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. డిజాస్టర్స్ [more]

Update: 2019-05-02 06:45 GMT

మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో తన 25 వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే తన 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ తనతో పనిచేసి తనకు హిట్స్ ఇచ్చిన, ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకుల గురించి చాలా గొప్పగా మాట్లాడాడు కానీ కొంతమంది దర్శకుల గురించి మాట్లాడలేదు. మర్చిపోయాడో లేదా కావాలనే చేసాడో కానీ తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఒక దర్శకుడి గురించి ఆ వేడుకలో చెప్పలేదు. అలాగే మరొక డైరెక్టర్ మీద ఇండైరెక్ట్ గా సెటైరికల్ డైలాగ్ వేసాడు.

పూరినే మర్చిపోతాడా..?

మరి ఇదంతా చూస్తుంటే మహేష్ మనసులో ఏదో పెట్టుకునే ఇలా చేశాడా? అనే డౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. మహేష్ కి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాధ్ ని మహేష్ మరిచాడు. పోకిరి లాంటి హిట్ ఇచ్చిన పూరిని మహేష్ మరవడం మాత్రం కాస్త ఆశ్చర్యమే. బిజినెస్ మ్యాన్ ద్వారా కూడా మహేష్ కి హిట్ ఇచ్చిన పూరీని మహర్షి ఈవెంట్ లో కనీసం తలవకపోవడం అనేది ఆలోచించాల్సిందే. మరి వీరి కాంబోలో మూడో మూవీగా జనగణమన తెరకెక్కాల్సి ఉంది. కానీ పూరి చెప్పిన కథకు మహేష్ కనెక్ట్ కాకపోవడంతో మహేష్ పూరిని లైట్ తీసుకున్నాడు. ఇక పూరి కూడా మహేష్ తోనే జనగణమన తీస్తానని పట్టుబట్టుకుని కూర్చుకున్నాడు.

సుకుమార్ కు కౌంటర్..?

ఇక తాజాగా రంగస్థలం హిట్ దర్శకుడు సుకుమార్ కి మహేష్ హ్యాండ్ ఇచ్చాడు. మహేష్ తో సినిమా కోసం ఏడాది వెయిట్ చేసిన సుకుమార్ ని కూడా మహేష్ పక్కన పెట్టేసాడు. మహర్షి ఈవెంట్ లో సుకుమార్ పై కూడా మహేష్ ఇండైరెక్ట్ గా ‘‘ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గరయినా కథ ఉంటే ఒక రెండు నెలలు ఆలస్యమైతే చాలు.. వేరే హీరోల దగ్గరకు వెళ్లిపోతారు. కానీ అలా కాకుండా నా కోసం రెండేళ్లు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వంశీ.’’ అని చెప్పాడు. నిజానికి వంశీ రెండేళ్లు కాదు.. మూడేళ్లు వెయిట్ చేశాడు.. అంటూ సుకుమార్ కి పంచ్ వేస్తూ వంశీ పైడిపల్లిని మహేష్ పొగిడేసాడు. మరి మహేష్ కి సుకుమార్, పూరీ అంటే కోపమా.. అందుకే అలా ఆ ఈవెంట్ లో మాట్లాడాడు అంటూ సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News