త‌మ్ముడు ఎన్టీఆర్‌ను కాపీ కొట్టిన అన్న మ‌హేష్‌

Update: 2018-04-07 17:55 GMT

ఈ హెడ్డింగ్ ఏంటి విచిత్రంగా ఉందే.... ఎస్ ఇది నిజ‌మే త‌మ్ముడు ఎన్టీఆర్‌ను అన్న మ‌హేష్ కాపీ కొట్టేశాడు. ఈ విష‌యాన్ని మ‌హేషే స్వ‌యంగా ఒప్పుకున్నాడు. మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అను నేను ప్రి రిలీజ్ ఈవెంట్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లోని ఎల్డీ స్టేడియంలో జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌కు మ‌హేష్‌బాబు - ఎన్టీఆర్ ఇద్ద‌రే మెయిన్ హైలెట్‌. వీరిని వేదిక‌మీద ప‌క్క ప‌క్క‌నే చూసేందుకు ఫంక్ష‌న్‌కు హాజ‌రైన వారితో పాటు టీవీల్లో ఈ ప్రోగ్రాం చూస్తోన్న వారికి రెండు క‌ళ్లు చాల‌లేదు.

హీరోయిన్ కైరా, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాట్లాడిన త‌ర్వాత ఎన్టీఆర్ మాట్లాడాడు. ఎన్టీఆర్ ప్ర‌సంగం స్టార్ట్ చేస్తూ నంద‌మూరి తార‌క రామారావు మ‌న‌వడు అయిన ఎన్టీఆర్ అను నేను అన్న డైలాగ్‌తో ప్ర‌సంగం స్టార్ట్ చేశాడు. భ‌ర‌త్ అను నేను సినిమాలో మ‌హేష్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసే ముందు చెప్పే డైలాగ్‌ను ఎన్టీఆర్ ఇక్క‌డ త‌న ప్ర‌సంగం స్టార్ట్ చేసేముందు చ‌క్క‌గా వాడుకున్నాడు. ఎన్టీఆర్ ఈ మాట చెప్పాక త‌న ప్ర‌సంగం కంటిన్యూ చేశాడు. ఎన్టీఆర్ త‌న ప్ర‌సంగంలో మ‌హేష్‌ను తాను ఎప్పుడూ అన్న‌గా సంబోధిస్తాన‌ని చెప్పాడు.

ఇక ఎన్టీఆర్ ప్ర‌సంగం త‌ర్వాత మాట్లాడిన మ‌హేష్ ముందుగా సూప‌ర్‌స్టార్ కృష్ణ గారి త‌న‌యుడు అయిన మ‌హేష్ అను నేను అని ఎన్టీఆర్ స్టార్టింగ్‌ను అనుక‌రించాడు. అంతే కాకుండా తాను ఈ మాట‌ను త‌మ్ముడు ఎన్టీఆర్ నుంచి కాపీ కొట్టాన‌ని న‌వ్వుతూ చెప్పాడు. ఇక తాను ఎన్టీఆర్ ఆది సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిథిగా వెళ్లాన‌ని.... మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఇప్పుడు ఎన్టీఆర్ త‌న సినిమాకు ముఖ్య అతిథిగా వ‌చ్చార‌ని మ‌హేష్ నాటి విష‌యాన్ని గుర్తు చేశాడు.

Similar News