మహేష్ అన్న ఐదారుగురు పెద్ద హీరోలు ఎవరు?

Update: 2018-04-08 10:19 GMT

భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్.. మన టాలీవుడ్ లో తిప్పి కొడితే ఐదారుగురు పెద్ద హీరోలు ఉన్నాం అన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరా ఐదారుగురు హీరోలు అన్నది పెద్ద చర్చనీయాంశమే అయ్యాయి. మహేష్ బాబు తరంతో చూసుకుంటే మహేష్ తో పాటు స్టేజి మీద ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబ్బట్టి ఇద్దరు పెద్ద హీరోస్ అయ్యిపోయారు.

ఇక మహేష్ బాబుకి పోటీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దీంతో పవన్ తో కలుపుకుంటే మొత్తం ముగ్గురు అయ్యిపోయారు. ఇక మెగా ఫామిలీ నుండి చూసుకుంటే అల్లు అర్జున్ నాలుగోవాడు. తర్వాత అదే ఫాలోయింగ్ ఉన్న హీరో రామ్ చరణ్ ఐదోవాడు. ఇక మిగిలిన వాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నమాట. మహేష్ ఈ ఆరుగురిని మాత్రమే లెక్కలోకి తీసుకుని ఐదారుగురు అన్నట్లున్నాడు.

నిజానికి మహేష్ ప్రస్తావించింది ఫ్యాన్స్ మధ్య వార్ గురించే వ్యాఖ్యలు చేశాడు. కానీ ఫ్యాన్స్ మధ్య గొడవలు టాలీవుడ్ కి కొత్త ఏమి కాదు.. ఎప్పటి నుండో ఈ గొడవలు ఉన్నాయ్. చిరంజీవి - బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఎప్పట్నుంచో వార్ నడుస్తోంది. అయితే మహేష్ వారిని పరిగణనలోకి తీసుకోలేదనే అనుకోవాలి. ఇక మిలిగిలిన హీరోస్ నాని.. రవితేజ..రానా..రామ్..సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోస్ ను మహేష్ పెద్ద హీరోలుగా పరిగణించట్లేదన్నమాట. సో మహేష్ లెక్క అయితే కరెక్టుగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News