సుకుమార్ ని ఏం అనలేదంటున్న మహేష్..!

మహేష్ బాబు మహర్షి ఫంక్షన్ లో వంశీ పైడిపల్లిని పొగిడితే… వంశీని పొగిడింది సుకుమార్ కి సెటైర్ వెయ్యడానికే అంటూ మీడియాలో గూడార్థలతో వార్తలు వచ్చాయి. సుకుమార్ [more]

Update: 2019-05-04 12:59 GMT

మహేష్ బాబు మహర్షి ఫంక్షన్ లో వంశీ పైడిపల్లిని పొగిడితే… వంశీని పొగిడింది సుకుమార్ కి సెటైర్ వెయ్యడానికే అంటూ మీడియాలో గూడార్థలతో వార్తలు వచ్చాయి. సుకుమార్ తో మహేష్ సినిమా ఆగిపోయిన నేపథ్యంలో మహేష్ బాబు మహర్షి ఈవెంట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లిని పొగుడుతూ… తన కోసం వంశీ మూడేళ్లు నిరీక్షించాడని, వేరే డైరెక్టర్ ఎవరన్నా అయితే తన కోసం ఆగకుండా వేరే హీరోని ఎతుక్కునేవారంటూ సుకుమార్ ని ఉద్దేశించే ఆ డైలాగ్ చెప్పాడంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. రీసెంట్ గా మహర్షి ఇంటర్వూస్ లో మీడియా వారి నుండి అదే ప్రశ్న ఎదురవగా దానికి మహేష్ తెలివైన సమాధానం చెప్పాడు.

మా సినిమా ఉంటుంది…

వంశీ పైడిపల్లిని తాను పొగిడాను కానీ.. సుకుమార్ ని ఏం అనలేదని.. ఆ విషయంలో మీడియా గూడార్ధాలు వెతకొద్దని చెప్పాడు. సుకుమార్ తనకి నేనొక్కడినే లాంటి మంచి చిత్రం ఇచ్చాడని, రంగస్థలం తర్వాత తామిద్దరం ఒక సినిమా చేద్దామనుకున్నామని.. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సేఫ్ జోన్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి…. ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయాల‌న్న ఉద్దేశంతోనే అనిల్ రావిపూడి క‌థ‌కు ఓకే చెప్పాన‌ని… ఈలోపు సుకుమార్ కూడా మరో సినిమా చేసి వస్తామన్నాడు. తర్వాత మేమిద్దరం కలిసి సినిమా చేద్దామని అనుకున్నామని.. కాబట్టి త్వరలోనే తమ కాంబోలో మూవీ ఉందని మహేష్ చెప్పాడు.

Tags:    

Similar News