హిట్ కొట్టాడు.. ఫ్లైట్ ఎక్కాడు

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమా మాస్ హిట్ గా నిలిచింది. సంక్రాతి పండగని బాగానే క్యాష్ చేసుకున్న మహేష్ [more]

Update: 2020-01-22 05:51 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమా మాస్ హిట్ గా నిలిచింది. సంక్రాతి పండగని బాగానే క్యాష్ చేసుకున్న మహేష్ బి సి సెంటర్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపాడు. అయితే మహేష్ తన కెరీర్ లోనే సరిలేరు నీకెవ్వరూ సినిమా అంటే ఇష్టమని, ఇక అనిల్ రావిపూడి తో సినిమా చేయడం సరదాగా ఉందని చెప్పడమే కాదు… విజయశాంతిలాంటి సీనియర్ నటితో నటించడం బావుందని చెప్పడం, ఎన్నడూ లేని విధంగా మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రమోషన్స్ కోసం కష్టపడ్డాడు.రిలీజ్ కి ముందు వెనక కూడా మహేష్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.

ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమాని ఆఘమేఘాల మీద పూర్తి చేసిన మహేష్.. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా క్షణం తీరికలేకుండా గడపడంతో.. ఇప్పుడు సరిలేరు సినిమా ముచ్చట్లు ముగిసాక ఫ్యామిలీ ట్రిప్ వేసాడు. సరిలేరు నీకెవ్వరూ తర్వాత మూడు నెలలు భారీ గ్యాప్ తీసుకుంటున్న మహేష్ ప్రస్తుతం కొడుకు గౌతమ్, కూతురు సితార, భార్య నమ్రతతో కలిసి న్యూ యార్క్ సిటీ చెక్కేసాడు. ఎప్పటిలాగే ఫ్యామిలీ ట్రిప్ వేసిన మహేష్ హిట్ సంతోషంతో ఫ్లైట్ ఎక్కాడు. అందుకే మహేష్ ఫ్యాన్స్ కూడా మహేష్ జాలిడే ట్రిప్ కి వెళుతుంటే.. హిట్ కొట్టాడు.. ఫ్లైట్ ఎక్కడంటూ ముచ్చటగా చెప్పుకుంటున్నారు. మరి న్యూ యార్క్ వెళ్ళేటప్పుడు దిగిన ఫొటోస్ తో సంతోషంలో ఉన్న మహేష్ ,మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు మహేష్ న్యూ యార్క్ సందడి ఫొటోస్ కోసం ఎదురు చూస్తారన్నమాట

Tags:    

Similar News