మూడు నెలల గ్యాప్ అందుకా మహేశా..?

సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదలకు ముందే.. తాను నెక్స్ట్ సినిమా కోసం మూడు నెలల భారీ గ్యాప్ తీసుకోబోతున్నట్లుగా చెప్పిన మహేష్ బాబు.. తన తదుపరి చిత్రాన్ని [more]

Update: 2020-01-26 08:07 GMT

సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదలకు ముందే.. తాను నెక్స్ట్ సినిమా కోసం మూడు నెలల భారీ గ్యాప్ తీసుకోబోతున్నట్లుగా చెప్పిన మహేష్ బాబు.. తన తదుపరి చిత్రాన్ని వంశి పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా చెప్పడమే కాదు… విడుదల ప్రమోషన్స్ చక్కబెట్టి.. ఫ్యామిలీ తో అమెరికా పయనమయ్యాడు కూడా. అయితే ఫ్యామిలీతో మూడు నెలల పాటు మహేష్ విదేశాల్లో ఉంటాడనే టాక్ అయితే నడుస్తుంది. అయితే మహేష్ ఫ్యామిలీ అమెరికా వెళ్ళింది ఎంజాయ్ చెయ్యడానికి కాదని.. వేరే కారణముంది అంటున్నారు.

ప్రస్తుతం పిల్లలల్తో న్యూ యార్క్ సిటీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న మహేష్ అమెరికా వచ్చింది మోకాలి ఆపరేషన్ కోసమనే టాక్ నడుస్తుంది. ఆగడు సినిమా షూటింగ్ సమయంలో మహేష్ కాలికి తగిలిన గాయంతో.. మహేష్ ఇప్పుడు బాధపడుతున్నాడని… . ఆ చికిత్స కోసమే మహేష్ బాబు.. అమెరికా వెళ్లినట్టు సమాచారం. అమెరికాలోనే తన మోకాలికి ఆపరేషన్ చేయించుకుని.. రెండు మూడు నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకున్న తర్వాత తన తదుపరి సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతాడని అంటున్నారు.

Tags:    

Similar News