మహర్షి కాంబినేషన్ రిపీట్ అవ్వనుందా?

మహర్షి…మహేష్ బాబు, వంశీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో మహేష్..వంశీ కి మరో సినిమా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మహేష్..అనిల్ రావిపూడి తో సినిమా [more]

Update: 2019-06-10 07:20 GMT

మహర్షి…మహేష్ బాబు, వంశీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో మహేష్..వంశీ కి మరో సినిమా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మహేష్..అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమా సంక్రాంతి లో రిలీజ్ అయిపోతుంది. దీని తరువాత వంశీ తో చేసే అవకాశముందని తెలుస్తుంది. మహేష్ కు ఎవరైనా డైరెక్టర్ నచ్చితే వెంటనే అవకాశాలు ఇవ్వడం అలవాటు అలానే వంశీ కి కూడా మరో ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం వీరు లండన్ లో క్రికెట్ మ్యాచులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు వారాల్లో తిరిగి ఇండియాకి వీరు రానున్నారు. అలా రాగానే మహేష్..అనిల్ సినిమాలో బిజీ అయిపోతాడు. వంశీ..మహేష్ సినిమా స్క్రిప్ట్ విషయంలో బిజీ కానున్నాడు.

ఇది ఒక మెసేజ్ ప్లస్ కమర్షియల్ అంశాలు కూడిన కథ అని బహుశా ఈ నవంబర్ లోపే ఫుల్ నేరేషన్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.అందుకు సంబంధించిన డిస్కషన్స్ లండన్ లో కొనసాగుతున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈసినిమా కు కూడా దిల్ రాజు నిర్మాత కానున్నాడు. దిల్ రాజు సోలో ప్రొడ్యూసర్ గా ట్రై చేస్తున్నాడు. మహేష్ కు దిల్ రాజు స్ట్రాటజీలకు ఫ్లాట్ అయ్యి ఎట్టకేలకు ఎస్ చెప్పినట్టు సమాచారం. అలా మహేష్ – వంశీ – దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా రెడీ అవ్వబోతుంది. అధికారిక ప్రకటన రావడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. మరి మహేష్…సరిలేరు నీకెవ్వరు తరువాత సందీప్ వంగ తో ఓ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఈలోపు వంశీ వచ్చాడు.

Tags:    

Similar News