ఈ ఇష్యూలోకి ఎన్టీఆర్ నూ లాగారుగా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ మహేష్ – సుకుమార్ సినిమా క్యాన్సిల్ అవ్వడం. మహేష్ సాయంత్రం ట్వీట్ చేయకముందు బన్నీ – సుకుమార్ ల ప్రాజెక్ట్ [more]

Update: 2019-03-07 07:27 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ మహేష్ – సుకుమార్ సినిమా క్యాన్సిల్ అవ్వడం. మహేష్ సాయంత్రం ట్వీట్ చేయకముందు బన్నీ – సుకుమార్ ల ప్రాజెక్ట్ అధికారంగా అనౌన్స్ చేసారు. అప్పటివరకు తన వైపు ఉన్న సుకుమార్ ఎందుకు సడన్ గా అటు షిఫ్ట్ అయ్యాడో అర్ధం కాక మహేష్ సాయంత్రం ట్వీట్ వేసాడు. తనతో సుకుమార్ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది, సుకుమార్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అల్ ధి బెస్ట్ చెపుతున్నా అని ట్వీట్ చేసాడు. అసలు బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అన్నది డిస్కషన్లోనే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సడన్ గా తెరపైకి వచ్చింది.

ముందు ఎన్టీఆర్ వద్దకు…

అయితే ఈ ప్రాజెక్ట్ మహేష్ దగ్గర నుండి అల్లు అర్జున్ దగ్గరకు చేరేలోపు మరోచోట కూడా ఆగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ తర్వాత సుకుమార్ డైరెక్ట్ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లలేదట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి స్టోరీ చెప్పి తనతో ఒక సినిమా ఉంటుందని ప్రకటన ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్ ను కోరాడని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట. రాజమౌళి సినిమా పూర్తి అయ్యేవరకు ఏ సినిమా కమిట్ అవ్వనని చెప్పాడట. సుక్కు ఎంత కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ఎన్టీఆర్ అదే మాట మీద ఉండడంతో ఆ ప్రాజెక్ట్ బన్నీ దగ్గరకు వెళ్లింది.

Tags:    

Similar News