మహేష్ - సుకుమార్ మూవీ అప్ డేట్స్..!

Update: 2018-11-26 11:57 GMT

'మహర్షి' మూవీలో బిజీగా ఉన్న మహేష్ ఈ సినిమా తరువాత సుకుమార్ తో 26వ చిత్రం చేయనున్నాడు. '1 నేనొక్కడినే' తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సుకుమార్ రీసెంట్ గా తీసిన 'రంగస్థలం' నాన్ బాహుబలి రికార్డ్స్ కు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే మహేష్ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సినీ సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుందంటున్నారు. కానీ మహేష్ బాబు మే నుండి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈసారి ప్రయోగం కాదు...

మే నుండి స్టార్ట్ అవుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదట ఫారెన్ లొకేషన్స్ లో కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఇక మహేష్ బాబు సరసన మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన మాత్రం లేదు. సుకుమార్ ఈసారి మహేష్ తో ఎక్స్పరిమెంట్ ఫిలిం కాకుండా స్ట్రెయిట్ ఫిలిం తీయనున్నాడు. దానికి సంబంధించి టీంతో కూర్చుని స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా ఓపెనింగ్ జరగనుంది.

Similar News