మహేష్ కి ఝలక్ ఇచ్చాడా..?

మహేష్ బాబుతో సినిమా కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నాడు సుకుమార్. రంగస్థలం సినిమా హిట్ తరవాత మహేష్ కూడా సుకుమార్ తో సినిమా చెయ్యడానికి గ్రీన్ [more]

Update: 2019-03-05 06:43 GMT

మహేష్ బాబుతో సినిమా కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నాడు సుకుమార్. రంగస్థలం సినిమా హిట్ తరవాత మహేష్ కూడా సుకుమార్ తో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. సుకుమార్ కి సొంత బ్యానర్ లాంటి మైత్రి వారే మహేష్ మూవీని నిర్మించడానికి రెడీ అయ్యారు. అయితే మధ్యలో సుకుమార్ కథ నచ్చక మహెష్, సుకుమార్ ని హోల్డ్ లో పెట్టి.. సందీప్ వంగాకు, అనిల్ రావిపూడి కమిట్ అవుతున్నాడని వార్తలొచ్చాయి. అయితే తాజాగా సందీప్ వంగా కూడా మహేష్ మూవీ చెయ్యడం లేదని తెలుస్తుంది. మరో పక్క మహేష్ మహర్షి తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తాడా…? అనిల్ రావిపూడితో సినిమా చేస్తాడా? అనే క్లారిటీ మీడియాకి దొరకడం లేదు. కాకపోతే గత రెండు రోజులుగా మహేష్ – సుకుమార్ సినిమా పట్టాలెక్కబోతున్నదని న్యూస్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నవేళ సడన్ గా నిన్న సుకుమార్ తో అల్లు అర్జున్ 20వ సినిమా అంటూ ఆఫీసియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది.

అల్లు అర్జున్ తో ఎందుకు..?

అటు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇటు సుకుమార్ తో తన 20వ చిత్రాన్ని మైత్రి వారికి చెయ్యడానికి రెడీ అయ్యాడు. మరి సుకుమార్ – అల్లు అర్జున్ సినిమా ఆగస్టు నుండి అంటున్నారు. మరోపక్క మహేష్ సుకుమార్ సినిమా జూన్ నుండి ఉంటుందని అంటున్నారు. అయితే సుకుమార్ కి మహేష్ ఏ సమాధానం చెప్పకుండా దాట వేయడంతో మైత్రి వారే సుకుమార్ తో అల్లు అర్జున్ సినిమాకి కమిట్ చేయించినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ విషయంలో ఆ లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టుగా ఉంది వ్యవహారం.

Tags:    

Similar News