మహేష్ గట్టిగానే కొట్టాలి!!

Update: 2018-04-19 12:00 GMT

మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉందొ వేరే చెప్పక్కర్లేదు. అసలు మహేష్ గత సినిమాలు డిజాస్టర్స్ అయినా కూడా అతనినుండి సినిమా వస్తుంది అంటే విపరీతమైన అంచనాలు ఆ సినిమాపై ఉంటాయి. కేవలం ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ మహేష్ సినిమాపై భారీ అంచనాలు వచ్చేస్తాయి. అనుకున్నదానికన్నా ఎక్కువే మహేష్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. మరి స్పైడర్, బ్రహ్మ్మోత్సవం సినిమాలు ఎంత పెద్ద డిజాస్టర్స్ అయినా ప్రస్తుతం భరత్ అనే నేను మహేష్ గత చిత్రాలతో పోల్చితే బిజినెస్ ఎక్కువగానే జరిగింది. అసలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను 100 కోట్లకు అమ్మారంటేనే ఈ సినిమాపై ఏ లెవల్లో అంచనాలు ఉన్నాయో అర్ధమవుతుంది.

మహేష్ స్టామినా ఇదే....

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మెయిన్ ఏరియా అయిన నైజాం హక్కులను 22 కోట్ల రూపాయలకు విక్రయించగా... సీడెడ్ హక్కులను 12.6 కోట్లకి విక్రయించారు నిర్మాతలు. అలాగే భరత్ కి వైజాగ్ 8.2 కోట్లు, తూర్పు గోదావరిలో 6.7 కోట్లు, ఇక పశ్చిమ గోదావరి లో 6 కోట్లు, కృష్ణా మరియు గుంటూరు 13.5 కోట్లు, నెల్లూరు 3.0 కోట్లు పలకగా... రెండు తెలుగురాష్ట్రాల వరకే భరత్ అనే నేను థియేట్రికల్ హక్కుల లెక్క 72కోట్లుగా తేలగా.... కర్నాటక 8.2 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.6 కోట్లు, ఓవర్సీస్ 18.2 కోట్లు పలకడంతో.. వరల్డ్ వైడ్ మొత్తమంగా 100 కోట్ల రూపాయల బిజినెస్ ను మహేష్ భరత్ అనే నేను చెయ్యడంతో మహేష్ స్టామినా అర్ధమవుతుంది.

టార్గెట్ రీచ్ అవుతాడా?

ఇక మహేష్ సినిమాల డిజాస్టర్స్ ని పక్కన పెట్టి తెలుగు శాటిలైట్స్ హక్కులు కూడా 22 కోట్లు పలకగా... హింది డబ్ రూపంలో 15.5 కోట్లు భరత్ అనే నేను కొల్లగొట్టింది. అలాగే ఆడియో హక్కులు మిగిలినవి కలిపి 2 కోట్లు రాగా...అన్ని కలిపి మొత్తంగా భరత్ అనే నేను ప్రీ రిలీజ్ బిజినెస్ 140 కోట్లు జరిగింది. మరి ఈ లెక్కన మహేష్ బాబు భరత్ అనే నేను తో షేర్ రూపంలోనే 105 కోట్ల వరకూ కొల్లగొట్టాల్సింది. మరి ఈలెక్కన కలెక్షన్స్ సాధిస్తేనే మహేష్ సూపర్ కొడతాడు. ఇక మరి కొన్ని గంటల్లోనే మహేష్ భరత్ అనే నేను ఓవర్సీస్ లో ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే 2 నుండి 3 మిలియన్స్ కలెక్షన్స్ సాధించాలనే టార్గెట్ తో మహేష్ బరిలోకి దిగుతున్నాడు.

Similar News