మహేష్ రూపాయి పెట్టకుండా ఎలా సంపాదిస్తున్నాడో చూడండి

మహేష్ బాబు తో పాటు సోనీ పిక్చర్స్‌ నిర్మిస్తూ అడివి శేష్ హీరోగా చేస్తున్న చిత్రం మేజర్ ఎప్పుడో అనౌన్స్ అయినా సంగతి తెలిసిందే. 26/11 ఘటనలో [more]

Update: 2019-08-26 08:13 GMT

మహేష్ బాబు తో పాటు సోనీ పిక్చర్స్‌ నిర్మిస్తూ అడివి శేష్ హీరోగా చేస్తున్న చిత్రం మేజర్ ఎప్పుడో అనౌన్స్ అయినా సంగతి తెలిసిందే. 26/11 ఘటనలో హీరోగా నిలిచిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ కథతో రూపొందుతోన్న ఈచిత్రంలో అడివి శేష్ అతని పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈమూవీలో మహేష్ ఏమి డబ్బులు పెట్టడంలేదట. సోనీ పిక్చర్స్‌ వారు కేవలం తన పేరు వాడుకుంటున్నారట. కాకపోతే నిర్మాణ వ్యవహారాలని మహేష్‌ భార్య నమ్రత పర్యవేక్షిస్తారు.

అంతే తప్ప మహేష్ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదట. కాకపోతే సోనీ వారు మహేష్ పేరు వాడుకున్నందుకు గాను సినిమాల్లో వచ్చిన లాభాల్లో ఇరవై శాతం వాటా మహేష్ కు ఇవ్వాలి. అదేవిధంగా మహేష్ తన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి కూడా డబ్బులు పెట్టలేదట. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌గా వచ్చేదంతా మహేష్ తీసుకుంటాడట. మహేష్ చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నాడు. రూపాయి పెట్టకుండా బాగానే డబ్బు వెనకేసుకుంటున్నాడు

Tags:    

Similar News