సరిలేరు కి మండే షాక్

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కి సరిలేరు నీకెవ్వరూ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే బ్లాక్ బస్టర్ హిట్ అనే అనుకున్నారు. కానీ రెండో రోజు [more]

Update: 2020-01-14 06:35 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కి సరిలేరు నీకెవ్వరూ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే బ్లాక్ బస్టర్ హిట్ అనే అనుకున్నారు. కానీ రెండో రోజు అల వైకుంఠపురములో సెగ తగలడం.. మండే రోజున వర్కింగ్ డే కావడంతో.. సరిలేరు నీకెవ్వరూ కలెక్షన్స్ కి కాస్త దెబ్బపడింది అనిపిస్తుంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తో చెలరేగిన మహేష్ రెండో రోజు అల్లు అర్జున్ ధాటికి కాస్త వెనక బడ్డాడు. ఇక మూడో రోజు వర్కింగ్ డే దెబ్బ పడింది. దానితో మూడో రోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సరిలేరు నీకెవ్వరూ సినిమాకి 44.77 కోట్లు వచ్చాయి. మరి ఈ పండగ మూడు రోజులు మహేష్ సరిలేరు మాస్ హిట్ కనక మల్లి బీసీ సెంటర్స్ లో ఓ లెవల్ రెచ్చిపోయి కలెక్షన్స్ దండుకోవడం ఖాయంగా కనబడుతుంది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 15.95
సీడెడ్ 6.19
నెల్లూరు 1.78
కృష్ణా 4.22
గుంటూరు 6.10
వైజాగ్ 6.58
ఈస్ట్ గోదావరి 4.53
వెస్ట్ గోదావరి 3.52

టోటల్ ఏపీ & టీ షేర్: 44.77

Tags:    

Similar News