‘సరిలేరు’ కి ‘అల’ దెబ్బ పడిందా?

మహేష్ సరిలేలు నీకెవ్వరూ సినిమాతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టాడు. మహర్షి కన్నా ఎక్కువగా ఓపెనింగ్స్ కొల్లగొట్టి.. మహేష్ సరిలేరు తో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. [more]

Update: 2020-01-13 07:57 GMT

మహేష్ సరిలేలు నీకెవ్వరూ సినిమాతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టాడు. మహర్షి కన్నా ఎక్కువగా ఓపెనింగ్స్ కొల్లగొట్టి.. మహేష్ సరిలేరు తో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. అయితే మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టిన సరిలేరు నీకెవ్వరూ కి రెండో రోజు మాత్రం కాస్త తగ్గింది. ఆదివారం అల వైకుంఠపురములో సినిమా విడుదల కావడంతో.. ఎక్కువ థియేటర్స్ అల వైకుంఠపురంలోకి కేటాయించడంతో….సరిలేరు నీకెవ్వరూ రెండో రోజు కాస్త డల్ అయ్యి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 41.42 కోట్లు కొల్లగొట్టాడు. అల వైకుంఠపురములో హిట్ టాక్ పడడం… సరిలేరు కలెక్షన్స్ తగ్గడానికి కూడా కారణమయ్యింది. ఇక సరిలేరు థ్యాంక్స్ మీట్ అంటూ హడావిడి చెయ్యడం, బిసి సెంటర్స్ ఆడియన్స్ ని ఈ సినిమా అట్రాక్ట్ చెయ్యడంతో… సరిలేరు కలెక్షన్ ఈ పండగ మూడు రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణుల అంచనా.

ఏరియా: 2 డేస్ షేర్ (కోట్లలో)
నైజాం 12.68
సీడెడ్ 5.15
నెల్లూరు 1.55
కృష్ణా 3.75
గుంటూరు 5.64
వైజాగ్ 5.46
ఈస్ట్ గోదావరి 4.04
వెస్ట్ గోదావరి 3.15

2 డేస్ ఏపీ & టీస్ షేర్: 41.42

Tags:    

Similar News