సరిలేరు పార్టీలకు నిజంగా సరిరారు ఎవ్వరూ

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమా శనివారం విడుదలైన మాస్ హిట్ కొట్టింది. అనిల్ రావిపూడి కామెడీ, మహేష్ యాక్షన్ [more]

Update: 2020-01-14 06:51 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమా శనివారం విడుదలైన మాస్ హిట్ కొట్టింది. అనిల్ రావిపూడి కామెడీ, మహేష్ యాక్షన్ సినిమా ని బిసి సెంటర్స్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమా ఒప్పుకున్నప్పటినుండి… మహేష్ బాబు, అనిల్ రావిపూడి మేకింగ్ స్టయిల్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పడమే కాదు… మూవీ టీం మొత్తానికి మహేష్ బాబు పర్సనల్ గా పార్టీ ఇచ్చాడు. అనిల్ రావిపూడి, రష్మిక, వంశి పైడిపల్లి, నమ్రత సితార, ఆద్య ఇలా అంతా మహేష్ పార్టీలో ఎంజాయ్ చేసారు. అంతేకాకుండా మహేష్ సినిమా ప్రమోషన్స్ ముగించుకుని.. రేపు సినిమా విడుదల అనగా మళ్ళీ రాత్రికి పార్టీ ఎరేంజ్ చేసి మూవీ టీం ని ఆనందంలో ముంచి లేపాడు.

ఇక సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్నాక విజయశాంతి, సంగీత, రష్మిక, అనిల్ రావిపూడి, సితార, ఆద్య, వంశి పైడిపల్లి, దిల్ రాజు, అనిల్ సుంకరలతో సక్సెస్ పార్టీ అంటూ మళ్ళీ ఓ రేంజ్లో మహేష్ పార్టీ పెట్టాడు. అంతేకాకుండా నిన్న తాజాగా మహేష్ పార్టీ కంటిన్యూ అంటూ తాము పార్టీలో ఎంజాయ్ చేస్తూ దిగిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేస్తున్నాడు. మహేష్ సరిలేరు హిట్ తో విపరీతమైన ఆనందంలో ఉండడంతో ఇలా పార్టీలు చేస్తూ చిత్ర బృందానికి ఊపిరాడనివ్వడం లేదంటూ మహేష్ ఫాన్స్ కూడా హ్యాపీ గా ఈ సంక్రాంతికి ఓ రేంజ్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలా సరిలేరు పార్టీలు చూసిన వారికీ మహేష్ సరిలేరు పార్టీలకు సాటిరారు ఎవ్వరూ అంటూ పొగిడేస్తున్నారు.

Tags:    

Similar News