దుకాణం సర్దేయ్యండి

సరిలేరు నీకెవ్వరూ సినిమా కు సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే రెండవ వారం నుండి ప్రేక్షకులు చుక్కలు చూపించారు. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమాని [more]

Update: 2020-02-03 10:02 GMT

సరిలేరు నీకెవ్వరూ సినిమా కు సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే రెండవ వారం నుండి ప్రేక్షకులు చుక్కలు చూపించారు. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమాని కాస్త మాస్ ప్రేక్షకులు ఆదుకున్నారు కానీ… లేదంటే యావరేజ్ హిట్ గానే ఈ సినిమా మిగిలిపోయేది. సినిమా విడుదలకు ముందు భీభత్సంగా సినిమాని ప్రమోట్ చేసిన మూవీ టీం కూడా విడుదలయ్యాక పెద్దగా పట్టించుకోలేదు. మరోపక్క అల వైకుంఠపురములో హావ మూడో వారంలో కూడా కొనసాగి.. నాలుగో వారంలోను తన ప్రతాపం చూపిస్తుంది. అలాగే ఆసినిమాకి విడుదలయ్యాక చేస్తున్న ప్రమోషస్న్ సినిమాని నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పడానికి దోహదపడ్డాయి. అల టీం ఎప్పుడు మీడియాకి దగ్గరగా ఉండడం.. అల్లు అర్జున్ సహా మూవీ టీం మొత్తం ప్రమోషన్స్ లో పాల్గొనడంతో.. అలా గట్టెక్కడం కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది.

కానీ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమా వ్యాపారం దాదాపుగా ముగిసింది. థియేటర్స్ లో ప్రేక్షకులు పెద్దగా కనిపించడంలేదు. థియేటర్ ఆక్యుపెన్సీ.. 10 శాతం ఉందంటే సరిలేరు నీకెవ్వరూ పొజిషన్ అర్ధమవుతుంది. మాములుగా ఈ సినిమా మహేష్ బాబుకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రం, అలాగే కొనుగోలుదారులకు మంచి కలెక్షన్స్ పోగేసిన సినిమానే. కానీ మేకర్స్ అనుకున్న హిట్ అయితే సరిలేరు నీకెవ్వరూ కొట్టలేకపాయింది అనేది వాస్తవం. అందుకే ఇక సరిలేరు దుకాణం మూసెయ్యడం కరెక్ట్ అంటున్నారు.

Tags:    

Similar News