సరిలేరు నీకెవ్వరూ టార్గెట్

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమా క్రేజ్ భారీ లెవల్లో ఉంది. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత [more]

Update: 2020-01-05 09:10 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమా క్రేజ్ భారీ లెవల్లో ఉంది. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ సినిమా కావడం, మహేష్ లాంటి క్రేజ్ స్టార్ హీరో సినిమా కావడంతో సరిలేరు నీకెవ్వరూ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇక మహేష్ క్రేజ్, అనిల్ రావిపూడి పై అంచనాలతో సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవల్లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 76 కోట్ల బిజినెస్ జరిగితే ఓవర్సీస్, కర్ణాటక, ఇతర ప్రాంతాలన్నీ కలిపి వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ టచ్ చేసింది. ఇంకా శాటిలైట్, డిజిటల్, హిందీ హక్కుల రూపంలో సరిలేరు నీకెవ్వరూ 45 కోట్లు కొల్లగొట్టి టోటల్ గా సరిలేరు బిజినెస్ పరంగా 145 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

ఏరియా: బిజినెస్ (కోట్లలో)
నైజాం 25.00
సీడెడ్ 12.00
నెల్లూరు 3.20
కృష్ణ 6.30
గుంటూరు 7.50
వైజాగ్ 9.60
ఈస్ట్ గోదావరి 7.50
వెస్ట్ గోదావరి 5.50

టోటల్ ఏపీ & టీస్: 76.70

కర్ణాటక 8.30
ఇతర ప్రాంతాలు 1.80
ఓవర్సీస్ 13.60

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 100.30

Tags:    

Similar News