సరిలేరు సర్దుకుంటే.. అలా ఎగిరెగిరి పడుతుంది

సంక్రాతి మూవీస్ లో ముఖ్యమైన సరిలేరు నీకెవ్వరూ – అల వైకుంఠపురములో సినిమాల మధ్యన రెండు వారాల గట్టి పోటీ నడిచిందనే చెప్పాలి. మహేష్ బాబు మాస్ [more]

Update: 2020-01-27 07:11 GMT

సంక్రాతి మూవీస్ లో ముఖ్యమైన సరిలేరు నీకెవ్వరూ – అల వైకుంఠపురములో సినిమాల మధ్యన రెండు వారాల గట్టి పోటీ నడిచిందనే చెప్పాలి. మహేష్ బాబు మాస్ గా, అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ లుక్ అండ్ క్లాస్ గా చెలరేగిపోయారు. మహేష్ – అనిల్ రావిపూడి సరిలేరు సినిమాకి మాస్ హిట్ పడగా.. బిసి సెంటర్స్ ప్రేక్షకులు సినిమాని లేపారు. అయితే అల వైకుంఠానికి ఫ్యామిలీస్ కనెక్ట్ అవడంతో.. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ సినిమాపైనే పడ్డారు. ఇక రెండు సినిమాల కలెక్షన్స్ పోరు పది రోజుల పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరిగింది. ఇక మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అని, మా సినిమా కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అంటే మా సినిమా కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు.

అయితే గత వారం రోజుల నుండి సరిలేరు నీకెవ్వరూ కలెక్షన్స్ డ్రాప్ అవడంతో సరిలేరు చిత్ర బృందం కలెక్షన్స్ బయటికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. మా సినిమా ఫైనల్ రన్ ముగిశాకే కలెక్షన్స్ బయటపెడతామని చెప్పారు. కానీ ఆలా వైకుంఠపురములో చిత్ర బృందం ఆగడం లేదు. మా సినిమా కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ రోజుకో పోస్టర్ వదులుతుంది. ఓవర్సీస్ లో టాప్ ఫైవ్ లో చేరిన అల వైకుంఠపురములో సినిమా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోఇండస్ట్రీ హిట్ అంటూ ఓ ఫిగర్ కాదు పోస్టర్ కూడా వదిలారు. ఆఫీషియల్ గా అల వైకుంఠపురములో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. మరి మూడో వారంలో సరిలేరు సర్దుకుంటే. అల వైకుంఠం ఇంకా ఎగిరెగిరి పడుతుంది.

Tags:    

Similar News