టీజర్ తో అలా కి చెక్ పెట్టేసారుగా

త్రివిక్రమ్ డైరెక్షన్, అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాదు.. అలా వైకుంఠపురంలోకి థమన్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పుడు మార్కెట్ లో పిచ్చేక్కిన్చే క్రేజ్ తో దూసుకుపోతున్నాయి. ఎక్కడ [more]

Update: 2019-11-25 05:08 GMT

త్రివిక్రమ్ డైరెక్షన్, అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాదు.. అలా వైకుంఠపురంలోకి థమన్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పుడు మార్కెట్ లో పిచ్చేక్కిన్చే క్రేజ్ తో దూసుకుపోతున్నాయి. ఎక్కడ విన్నా, ఎవరి ఫోన్ రింగ్ టోన్ చూసినా.. అలా వైకుంఠపురములో సాంగ్స్ రచ్చే. అయితే సంక్రాంతికి విడుదల కాబోతున్న మరో సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా సైలెంట్ ప్రమోషన్స్ చేసినా.. నిన్నటివరకు అలా వైకుంఠపురములో ముందు తేలిపోయింది. కానీ మహేష్ మ్యానియా, మహేష్ క్రేజ్ సరిలేరు నీకెవ్వరూ టీజర్ కటింగ్ తో అలా వైకుంఠపురములో కి చుక్కలు కనబడేలా చేసింది.

అల్లు అర్జున్ మ్యానియాతో ఎదో పొడిచేద్దామని… సరిలేరు నీకెవ్వరూ టీజర్ టైం లోనే అల్లు అర్జున్ పనిగట్టుకుని ఓమై డాడీ ఫుల్ సాంగ్ ని వదిలాడు. మహేషా.. అల్లు అర్జునా అంటూ సోషల్ మీడియా మొత్తం సెగలు పుట్టింది. అయితే మహేష్ ఒకే ఒక్క టీజర్ అల్లు అర్జున్ ని దడిపించేసింది. సామజవరగమనా, రాములో రాములా పాటలు యూట్యూబ్ లో రికార్డుల పరంగా సంచలనాలకు తెర లేపగా… ఓమై డాడీ సాంగ్ మాత్రం సరిలేరు నీకెవ్వరూ టీజర్ క్రేజ్ లో పడికొట్టుకు పోయింది. సరిలేరు నీకెవ్వరూ టీజర్ 40 గంటల్లోనే 20 మిలియన్ రియ‌ల్‌టైమ్ వ్యూస్ సాధించి 40 గంట‌ల పాటు కంటిన్యూగా యుట్యూబ్‌లో నెం 1 స్థానంలో ట్రెండింగ్‌ అవడంతో.. అలా వైకుంఠపురములో సాంగ్ డల్ అయ్యింది.

మరి సరిలేరు టీజర్ కి పోటీగా అలా సాంగ్ ని అల్లు అర్జున్ రాంగ్ టైం లో వదిలాడనిపించింది. మెగా ఫ్యాన్స్ ఇప్పటివరకు మహేష్ ఫ్యాన్స్ ని గడగడలాడిస్తే.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ని ఆడుకుంటున్నారు. మరి సరిలేరు నీకెవ్వరూ టీజర్ కి వచ్చిన వ్యూస్ అలా వైకుంఠపురములో సాంగ్ కి రాకపోయేసరికి.. ఇప్పటివరకు ఉత్సాహంతో ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు నీరుగారిపోయారు.

Tags:    

Similar News