ఫస్ట్ లుక్..అదుర్స్

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న ఈ చిత్రం [more]

Update: 2019-08-09 08:54 GMT

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ఇంట్రో టీజర్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారూ.. సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు…’ అంటూ సాగే ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సోల్జర్‌ గెటప్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. దేవిశ్రీప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇంట్రో టీజర్‌, ఫస్ట్‌లుక్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ విడుదల చేశారు.

సంక్రాంతికి….

ఈ సినిమాకి సంబంధించిన కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్నారు

Tags:    

Similar News