మహేష్..‘సరిలేరు నీకెవ్వరు’

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ [more]

Update: 2019-05-31 10:04 GMT

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ప్రారంభోత్సవం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(మే 31) అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టగా, మెగా మేకర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. కె.రాఘవేంద్రరావు, దిల్‌ రాజు సంయుక్తంగా స్క్రిప్ట్‌ ను దర్శకుడు అనిల్‌ రావిపూడికి అందించారు. ఫస్ట్‌ షాట్‌ను అనిల్‌ రావిపూడి దేవుడి పటాలపై చిత్రీకరించారు.

తారాగణం

మహేష్‌ బాబు, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్‌ అందిస్తున్నారు. నిర్మాతలుగా రామబ్రహ్మం సుంకర, దిల్‌ రాజు వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News