అల వైకుంఠాన్ని తట్టుకోవాలనుంటే ఈమాత్రం ఉండాలిలే!

సంక్రాతి సినిమాల్లో ఒకటైన అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ మార్కెట్ ని అల్లాడిస్తుంటే.. సరిలేరు నీకెవ్వరూ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలైపోతున్నారు. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా [more]

Update: 2019-11-20 08:35 GMT

సంక్రాతి సినిమాల్లో ఒకటైన అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ మార్కెట్ ని అల్లాడిస్తుంటే.. సరిలేరు నీకెవ్వరూ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలైపోతున్నారు. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా సాంగ్స్ పక్కనబెట్టి.. ముందు టీజర్ వదలడానికి రెడీ అయ్యింది టీం. నవంబర్ 22 న సరిలేరు నీకెవ్వరూ టీజర్ అంటూ ప్రకటించింది. అయితే సాంగ్స్ తో భీభత్సమైన క్రేజ్ సంపాదించినా అల వైకుంఠపురములో ముందు సరిలేరు నీకెవ్వరూ సినిమా చిన్నబోతుంది.. మహేష్ ఫాన్స్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ముందున్న అల వైకుంఠానికి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మహేష్ ఫాన్స్.

సరిలేరు నీకెవ్వరూ నుండి చిన్న అప్ డేట్ బయటికి వచ్చిన.. దాన్ని నిమిషాల్లో వైరల్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని గడగడలాడిస్తున్నారు. సరిలేరు పోస్టర్ వదిలినా సరే ట్విట్టర్ లో, పేస్బుక్ లో ఇలా సోషల్ మీడియాలో దేన్నీ వదలకుండా హంగామా చేస్తున్నారు. ఏలాగైనా సరిలేరు నీకెవ్వరు కి పిచ్చ క్రేజ్ తేవాలని మహేష్ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు. రేపు టీజర్ విడుదలైన సరే క్షణాల్లో టీజర్ కి లైక్స్ మోత మోగించడానికి పక్కా ప్రిపేర్ గా ఉన్నారు. సాంగ్స్ లేకపోతెనేమి.. టీజర్ తో మహేష్ దుమ్ము దలపడం ఖాయమంటూ మహేష్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా లేదు.

Tags:    

Similar News