మహేష్ గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు అనిల్

మహేష్ 26 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని డైరెక్టర్ అనిల్ [more]

Update: 2019-06-06 08:06 GMT

మహేష్ 26 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించినా సంగతి తెలిసిందే. ఆర్మీ మేజర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు అంటే బాడీ పెంచుతాడని, ప్రత్యేక ట్రెయినర్‌ని పెట్టుకుని కసరత్తులు చేస్తాడని ఫ్యాన్స్ అంత భావించారు.

కానీ ఈమూవీ కోసం మహేష్ ఎటువంటి ఎక్సర్‌సైజులు చేయాల్సిన పని లేదని, కొత్త గెటప్స్‌ కూడా ట్రై చేయనక్కరలేదని దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పష్టం చేసేసాడు. ఇందులో మహేష్ చేసేది మేజర్‌ పాత్రే కానీ అది ఎక్కువ సేపు ఉండదట. ఫోకస్ మొత్తం విలేజ్‌లో జరిగే ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌ పైనే వుంటుందట. సో బాడీ పెంచాల్సిన అవసరం లేదంటున్నాడు అనిల్.

అందుకే మహేష్ మహర్షి సినిమా సక్సెస్ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశాలు టూర్‌ చేస్తూ రిలాక్స్‌ అవుతున్నాడు. టూర్ నుండి రాగానే వెంటనే ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాడు. కేవలం ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తానని అనిల్ చెప్పడం మహేష్‌ కంప్లీట్‌గా రిలాక్స్‌ అయిపోయాడు. అందుకే రిలీజ్ డేట్ కూడా సంక్రాంతి అని ముందుగానే ప్రకటించారు.

Tags:    

Similar News