మహేష్ రివర్స్ స్ట్రాటజీ..!

మహర్షి సినిమా విషయంలో మహేష్ బాబు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. ఒక సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోతే ఆ సినిమా హీరోకి మింగుడు పడదు. చాలా [more]

Update: 2019-05-14 07:22 GMT

మహర్షి సినిమా విషయంలో మహేష్ బాబు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. ఒక సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోతే ఆ సినిమా హీరోకి మింగుడు పడదు. చాలా డల్ అయిపోతారు. అదేంటి ఇలా జరిగింది… ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాకు రిజల్ట్ ఇలా వచ్చిందేంటి అని దిగులు పడిపోతుంటారు. అయితే ఇప్పుడు మహర్షి విషయంలో మహేష్ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. టాక్ కు అతీతంగా కాన్ఫిడెన్స్‌ చూపిస్తూ తమ సినిమా తమకి గర్వకారణం అంటూ కాలర్‌ ఎగరేసాడు. ఇది చాలా రెగ్యులర్ సినిమా అని అందరికీ తెలిసిందే. మహేష్ నటన కొత్తగా ఉంది కానీ సినిమా స్టోరీ లైన్ మహేష్ ఇంతకుముందు చేసిన సినిమాలలా ఉందనే టాక్‌ గట్టిగా వినిపిస్తుంది.

కాల‌ర్ ఏగ‌రేస్తున్నాడే

సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ కాలర్లు ఎగరేసుకోవడం కామన్. కానీ తన మూవీ హిట్ అయిందని హీరోనే కాలర్‌ ఎగరేయడం కొంచం కొత్తే. నిజానికి మహర్షి సినిమా మహేష్‌ కాలర్‌ ఎగరేసే అంత గొప్ప సినిమానా అనే కుతూహలం స్టార్ట్‌ అయింది. కానీ మహేష్ ఎగురేశాడు. అందుకే ఈ మూవీకి వసూళ్లు డ్రాప్‌ అవకుండా స్టడీగా సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కి, టాక్‌కి సంబంధం లేదు. మిక్స్డ్ టాక్ వచ్చినా మహర్షికి మహేషే కలెక్షన్స్ తెపిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి కాదు.

Tags:    

Similar News