అనిల్ రావిపూడి వాడకం మాములుగా లేదట

అనిల్ రావిపూడి – మహేష్ బాబు ల సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ చిత్రీకరణ చివరిదశలో ఉండగా… పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కామెడీ యాక్షన్ [more]

Update: 2019-11-27 06:09 GMT

అనిల్ రావిపూడి – మహేష్ బాబు ల సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ చిత్రీకరణ చివరిదశలో ఉండగా… పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కామెడీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సరిలేరు టీజర్ తో సినిమాపై క్రేజ్ పెంచేసిన టీం.. ఇకనుండి సింగిల్స్ తో దుమ్ములేపడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క నటుడిని దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ కోసం వాడేసాడని మూవీ యూనిట్ ని కదిపితే చెబుతున్న మాట.

మహేష్ దగ్గరనుండి, ప్రకాష్ రాజ్, రష్మిక, కమెడియన్స్ టీం ఇలా అందరిని అనిల్ వాడినట్లుగా మరెవ్వరూ వాడలేదంటున్నారు. ఒక్క విజయశాంతి కేరెక్టర్ మినహా అనిల్ రావిపూడి సినిమాలో లో ఉన్న అందరితో కామెడీ చేయించాడని అంటున్నారు. టీజర్ లో మహేష్ బాబు కామెడీ డైలాగ్, ప్రకాష్ రాజ్ భయపడుతూ చెప్పే.. అల్లుళ్ళు, మొగుడు డైలాగ్ ఇలా అన్ని డైలాగ్స్ లోకి అనిల్ ఎక్కువగా కామెడీ టచ్ ఇచ్చి… సరదాగా సినిమాని పూర్తి చేసాడని, ఎమోషన్ బలంగా ఉన్నప్పటికీ.. యాక్షన్ కూడా కామెడీ తో నింపేసాడని చెబుతున్నారు. అందుకే అనిల్ రావిపూడి కామెడీ వాడకం మాములుగా లేదుగా అంటున్నారు.మరి విజయ్ శాంతి పవర్ ఫుల్ కేరెక్టర్ మినహా అంతా కామెడీ చేసారంటే…. సినిమా అంతా కడుపుబ్బా నవ్వడం ఖాయం అంటున్నారు మహేష్ ఫాన్స్.

Tags:    

Similar News