సోమవారం స్పెషల్ ఏంటి మహేశు

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంక్రాంతి బరిలో నిలవబోతున్న మహేష్ బాబు అండ్ అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంతో ఉన్నారు. అల్లు అర్జున్, రజినీకాంత్ [more]

Update: 2019-11-28 07:19 GMT

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంక్రాంతి బరిలో నిలవబోతున్న మహేష్ బాబు అండ్ అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంతో ఉన్నారు. అల్లు అర్జున్, రజినీకాంత్ ల మీద పోటీకి దిగుతున్న మహేష్ బాబు – అనిల్ రావిపూడి తమ సినిమా హిట్ అని అంటున్నారు. ఆనడమే కాదు… సరిలేరు నీకెవ్వరూ టీజర్ తో వార్ వన్ సైడ్ అనేలా ప్లాన్ చేసింది టీం. మహేష్ లుక్స్, స్టైలిష్ నటన, యాక్షన్ అండ్ కామెడీ హైలెట్ గా నిల్వనున్న ఈ సినిమా సాంగ్స్ కూడా మార్కెట్ ని షేక్ చెయ్యడానికి సిద్దమవుతున్నాయి.

అల్లు అర్జున్ తో పెట్టుకున్న మహేష్ మాత్రం సరిలేరు ప్రమోషన్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇప్పటివరకు పోస్టర్స్ అండ్ వర్కింగ్ స్టిల్స్ తోనే ఒక ఊపు ఊపిన మహేష్, టీజర్ తోనూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. తాజాగా మహేష్ మరో డెసిషన్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో వైరల్ అయ్యింది. అది సినిమా జనవరి 11 న విడుదలయ్యేవరకు ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రమోషన్స్ తో హోరెత్తించే ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి సోమవారం మహేష్ సరిలేరు నీకెవ్వరూ పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ ఇలా ఏదో ఒకటి విడుదల చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. అయితే మహేష్ బాబు ఆలోచనకు కొంతమంది ముగ్దులైన.. మరి కొంతమంది ఈ మండే సెంటిమెంట్ ఏంటి బాసు… అని సోమవారం స్పెషల్ ఏంటి మహేశు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News