సరిలేరు నీకెవ్వరూ హైలెట్స్

సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి.. మహేష్ బాబు – అనిల్ రావిపూడి రిలాక్స్ అయ్యారనుకుంటున్నారేమో.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంటూ మహేష్ [more]

Update: 2019-12-19 06:10 GMT

సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి.. మహేష్ బాబు – అనిల్ రావిపూడి రిలాక్స్ అయ్యారనుకుంటున్నారేమో.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంటూ మహేష్ డబ్బింగ్ కి అనిల్ రావిపూడి ఇతర కార్యక్రమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇంకా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటిగా మొదలుకాబోతున్నాయి. ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరూ సినిమా పాటల విషయంలో బెంగపెట్టుకోకండి.. అనిల్ రావిపూడి దర్శకత్వాన్ని నమ్మండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఎందుకంటే దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సో సో గా ఉండడంతో… అందరూ ఇలా అంటున్నారు. ఇక సరిలేరు సినిమాలో మెయిన్ హైలెట్స్ అంటూ ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ముందు నుండి చెబుతున్నట్టుగానే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని, 20 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని, ఆ ట్రైన్ ఎపిసోడ్ లో జబర్దస్త్ బ్యాచ్ తో బండ్ల చేసే కామెడీ చాలా బాగా వచ్చింది అని అంటున్నారు. ఇక ట్రైన్ ఎపిసోడ్ లోనే హీరోయిన్ రష్మిక, మహేష్ బాబు ని పడెయ్యడానికి పడే పాట్లని అనిల్ రావిపూడి కామెడీ టచ్ ఇచ్చాడని టాక్. ఇక సినిమా ఓపెనింగ్ అప్పడు తీసిన యాక్షన్ సీన్స్ కూడా మెయిన్ హైలెట్ కాబోతున్నాయని, అలాగే తమన్నా స్పెషల్ ఐటెం కూడా సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. మరి సరిలేరు టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచిన టీం.. ఇప్పుడు ప్రమోషన్స్ తో వాటిని మరింత పెంచే ప్లాన్ చేస్తుందట.

Tags:    

Similar News