సరిలేరు నీకెవ్వరూ తో పిచ్చెక్కిస్తారట

మహేష్ హీరోగా అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఇక ప్రమోషన్స్ లో కాస్త వీక్ గా వున్న [more]

Update: 2019-11-04 05:46 GMT

మహేష్ హీరోగా అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఇక ప్రమోషన్స్ లో కాస్త వీక్ గా వున్న మహేష్ అండ్ అనిల్ రావిపూడి లు ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చెయ్యడానికి సరిలేరు నీకెవ్వరూ వర్కింగ్ స్టిల్స్ ని వదులుతున్నారు. ఆ స్టిల్స్ కూడా పవర్ ఫుల్ గా ఉండడంతో మహేష్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే సరిలేరు నీకెవ్వరూ మ్యూజిక్ విషయంలో మహేష్ అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ… దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళకి హామీ ఇస్తుండడంతో… వాళ్ళు కుదుటపడుతున్నారు. ఇక విడుదలకు రెండు నెలలు టైం ఉన్న సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చెయ్యడానికి సరిలేరు టీం రెడీ అవుతుంది.

దీపావళికి టీజర్ అనుకున్నారు కానీ.. అప్పుడు కాకుండా నవంబర్ మూడో వారం నుండి సరిలేరు నీకెవ్వరూ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో మొదలుపెట్టి.. అభిమానులకే కాదు.. ప్రేక్షకులకు ఊపిరాడకుండా చెయ్యాలని టీం ప్లాన్ చేస్తుంది. ఈ నెల మూడో వారంలో విడుదలకాబోయే టీజర్ లో సినిమానుండి యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్ని చూపించాలనుకుంటున్నారట. టీజర్ తోనే సినిమా పై భారీగా అంచనాలు పెంచడానికి గట్టి ప్లాన్ వేస్తుంది టీం. మరి భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. విజయ శాంతి రీ ఎంట్రీ, హిట్ హీరోయిన్ రష్మిక, ప్రకాష్ రాజ్ లాంటి నటులు సినిమాలో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News